Pawan Kalyan’ ‘Bro’ teaser : 48 గంటల్లో పాన్ వరల్డ్ రికార్డ్స్ మొత్తం అవుట్..చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’ టీజర్

ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన 'వినోదయ్యా చిత్తం' కి సంబంధించిన స్టోరీ లైన్ ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Written By: Vicky, Updated On : July 1, 2023 5:10 pm
Follow us on

Pawan Kalyan’ ‘Bro’ teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్ ‘ ఈ నెల 28 వ తారీఖున ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ కి సంబంధించిన స్టోరీ లైన్ ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సముద్ర ఖని దర్శకత్వం వహించగా, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అంతే కాదు ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొడుతోంది.

పాన్ ఇండియన్ సినిమాలు మరియు పాన్ వరల్డ్ సినిమాల టీజర్స్ కూడా ఈ రేంజ్ వ్యూస్ మరియు లైక్స్ ని దక్కించుకోలేదని, పవర్ స్టార్ మాస్ కి యూట్యూబ్ మొత్తం ఊగిపోతుందని అంటున్నారు. ఈ చిత్రానికి 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ మరియు నాలుగు లక్షల 90 వేల లైక్స్ వచ్చాయి. వ్యూస్ విషయం లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఈ రేంజ్ వ్యూస్ రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ చిత్రం ‘ఆదిపురుష్’ టీజర్ కి కూడా రాలేదట.

ఇక మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం టీజర్ వ్యూస్ మరియు లైక్స్ ని ‘బ్రో’ టీజర్ 48 గంటలు కూడా పూర్తి కాకముందే బ్రేక్ చేసిందట. గుంటూరు కారం టీజర్ కి ఇప్పటి వరకు 32 మిలియన్ వ్యూస్ మరియు నాలుగు లక్షల 25 వేల లైక్స్ రాగా, బ్రో టీజర్ కేవలం 40 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 15 వేల లైక్స్ వచ్చాయి, ఇక రాబొయ్యే రోజుల్లో ఈ టీజర్ ఇంకెన్ని రికార్డ్స్ ని సృష్టిస్తుందో చూడాలి.