Pawan Kalyan Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ రాజకీయ షెడ్యూల్ వల్ల కుదరడం లేదు కానీ, ఈ చిత్రం లో మరో హీరోగా నటించిన సాయి ధరమ్ తేజ్, అలాగే హీరోయిన్స్ లో ఒకరైన కేతిక శర్మ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.
కాసేపటి క్రితమే కేతిక శర్మ మీడియా కి ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఇక అతి తావరలోనే సాయి ధరమ్ తేజ్ కూడా వరుసగా ఇంటర్వ్యూస్ ఇవ్వబోతున్నాడు. అందులో ఒక ఇంటర్వ్యూ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ చెయ్యబోతున్నాడు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన షూటింగ్ కూడా జరగబోతుంది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, పవన్ కళ్యాణ్ తన పాత్రకి డబ్బింగ్ కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఈ సినిమాని సెన్సార్ కి పంపించేసారట. ఈ వారం లోనే ఎదో ఒక రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోబోతుంది ఈ చిత్రం. మరి సెన్సార్ సభ్యుల నుండి ఎలాంటి టాక్ రాబోతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి సెన్సార్ టాక్ బయటకి వచ్చేస్తున్నాయి.
ఆ టాక్ కి దాదాపుగా 90 శాతం వరకు విడుదల తర్వాత సినిమా మ్యాచ్ అవుతుంది, అలా వచ్చిన టాక్స్ అన్నీ నిజం అయ్యాయి. మరి ‘బ్రో ది అవతార్’ చిత్రానికి పాజిటివ్ టాక్ రాబోతోందా లేదా నెగటివ్ టాక్ రాబోతోందా అనేది చూడాలి. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా ఫన్ తో కూడిన మంచి ఎమోషనల్ మూవీ అనే టాక్ ఉంది. ఆ టాక్ ని సెన్సార్ టాక్ మ్యాచ్ చేస్తుందో లేదో చూడాలి.