Pawan Kalyan Watch : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బందిపోటు ‘హరిహర వీరమల్లు’ పాత్రను పోషిస్తున్నారు. ఇంతవరకూ ఇలాంటి చారిత్రక పాత్రల్లో పవన్ నటించలేదు.దీంతో ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు పవన్ అభిమానుల్లో ఈ సినిమాపై బోలెడన్నీ అంచనాలున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవల్ లో హిందీ సహా దక్షిణాది భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో మొదటిసారి పవన్ కళ్యాణ్ వారియర్ లుక్ లో కనిపించనున్నారు.

కొద్దిరోజులుగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 17 నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా కోసం వర్క్ షాప్ షెడ్యూల్ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ తోపాటు చిత్రం యూనిట్, సంగీత దర్శకుడు కీరవాణి కూడా హాజరయ్యారు.
ఈ వర్క్ షాప్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ డిఫెరెంట్ లుక్ లో అదిరిపోయాడు. కోరమీసాలతో .. స్మార్ట్ లుక్ లో పవన్ అదరగొట్టాడని అంటున్నారు. ఆ లుక్స్ వైరల్అవుతున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ ఎర్రటి టీషర్ట్ వేసుకొని కింద బ్లూ జీన్స్ తో చాలా సింపుల్ గా కనిపించాడు. ఈ ఫొటోను కనిపిస్తే పవన్ చేతికి ఒక ప్రత్యేకమైన వాచ్ ఉన్నట్టు మనకు కనిపిస్తోంది. ఆ వాచ్ ఏంటి? దాని ఖరీదు ఎంత అని అందరూ ఆరాతీస్తున్నారు.
పవన్ పెట్టుకున్న వాచ్ పేరు ‘పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47mm’ . దీని ధర అక్షరాల రూ.14.7 లక్షల రూపాయలంట.. ఎన్నో ప్రత్యేకతలు గలది ఈ వ్యాచ్. ఈ వాచ్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఇక పవన్ వేసుకున్న షూస్ కూడా ‘కోపెన్ హాగన్ ’బ్రాండ్ అని ఇవి కూడా ఏకంగా రూ.9.60 లక్షలు ఉంటాయని చెబుతున్నారు. ఇంత ఖరీదైన వాచ్, షూస్ ధరించాడని.. పవన్ రేంజ్ కు ఈ ఖర్చు చాలా తక్కువేనని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పవన్ వాచ్ గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.
