Pawan Kalyan to Romance This Actress: ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కోసం భారీ రేంజ్ లో ప్రొమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ మీడియా, లోకల్ మీడియా అని తేడా లేకుండా ప్రతీ మీడియా కి ఆయన ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ లోని ఈ మార్పుని చూసి అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. ఇదేంటి..మేము చూస్తున్నది నిజంగా పవన్ కళ్యాణ్ నేనా?, ఏనాడూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప, కనీసం ఒక్క చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొనడమే కాకుండా, మీడియా ఇంటరాక్షన్ లు చేయడం, సక్సెస్ పార్టీ లో పాల్గొనడం, అసలు పవన్ కి ఏమైంది? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక నేషనల్ మీడియా కి ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ చెప్పిన సమాదానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Power Star @PawanKalyan rapid fire with @thehauterrfly on which co actress would he want’s to share screen with pic.twitter.com/60NKSbfhDH
— శ్రీ రామ్ (@JSPSriram) July 28, 2025
యాంకర్ పవన్ కళ్యాణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘అలియా భట్..లేదా దీపికా పదుకొనే..వీళ్ళిద్దరిలో మీరు ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడుతారు?’ అని అడగ్గా, దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘ఇది కాస్త డిఫరెంట్ ఛాయస్’ అని చెప్తాడు. అప్పుడు యాంకర్ లేదు మీరు ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలని అడగ్గా, పవన్ కళ్యాణ్ నేను ఇద్దరినీ సెలెక్ట్ చేసుకుంటాను అని ఫన్నీ గా సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ‘అలియా భట్..దీపికా పదుకొనే..క్రితి సనన్’ ఈ ముగ్గురిలో ఎవరితో కలిసి నటించడానికి ఇష్టపడుతారు అని అడిగితే, ముగ్గురితో కలిసి నటిస్తాను అంటూ సమాధానం ఇస్తాడు పవన్ కళ్యాణ్. అలా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాదానాలు చూసి అభిమానులు సైతం కంగుతిన్నారు. ఆ తర్వాత కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, క్రితి సనన్ పేర్లు చెప్పు వీరిలో మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడగ్గా, పవన్ కళ్యాణ్ కంగనా రనౌత్ పేరు చెప్తాడు.
Also Read: బిగ్ బాస్ 9′ ఎలిమినేషన్ ప్రక్రియలో సంచలన మార్పు..ఎవ్వరూ ఊహించని ట్విస్ట్!
ఆమె ఇందిరా గాంధీ బయోపిక్ లో కూడా నటించింది, చాలా ధైర్యం ఉన్న అమ్మాయి, కాబట్టి నేను ఆమెనే సెలెక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో శ్రీదేవి, కంగనా రనౌత్ వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడగ్గా, పవన్ అందుకు సిగ్గుపడుతూ శ్రీదేవి పేరు చెప్తాడు. పవన్ ఇలా మాట్లాడడం చూసి అభిమానులు సైతం ఇది అసలు నిజమైన వీడియోనా?, లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన వీడియోనా? అని సందేహాలు వ్యక్తం చేశారు ఫ్యాన్స్. కానీ అది నిజమైన వీడియోనే అని తెలియడం తో పవన్ కళ్యాణ్ లో వచ్చిన ఈ మార్పుని చూసి ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిన ఈ వీడియో మీరు కూడా చూసేయండి.