Pawan kalyan- Chiranjeevi: ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మెగాస్టార్ కి కథ చెప్పాలని చూస్తున్నారు. కాస్త విషయం ఉన్న డైరెక్టర్ ను కదిలించినా మెగాస్టార్ కి కథ రాస్తున్నా అంటున్నారు. పైగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాకా.. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు. వయసు పై బడిన అదే ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు. తాజాగా చిరు మరో యంగ్ డైరెక్టర్ కి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తొంది.

‘నీదీ నాదీ ఒకే కథ`తో ఆకట్టుకొన్నాడు వేణు ఉడుగుల. ఇప్పుడు రానాతో `విరాటపర్వం` తెరకెక్కించాడు. ఈ దర్శకుడు చిరంజీవికి ఆ మధ్య ఒక కథ చెప్పారు. విరాట పర్వం టీజర్ చిరు చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో వేణు ఉడుగుల – చిరు మధ్య కథకు సంబంధించి చర్చలు జరిగాయి. `మంచి కథ చెప్పావు. మనం కలిసి సినిమా చేద్దాం` అని అప్పుడే చిరు మాట ఇచ్చారని తెలుస్తోంది.
Also Read: AP Power Bills: కరెంట్ కట్ కటా: ఏపీలో ప్రజలు ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దని ఆదేశం..
అయితే, తాజాగా చిరు నుంచి మళ్లీ వేణుకి పిలిపు వచ్చింది. నిజానికి ఈ మధ్య మెగాస్టార్ కి కథలు అసలు నచ్చడం లేదట. ఎంతమంది బడా దర్శకులు ఇంటికి వచ్చి.. గొంతు అరిగిపోయేలా కథలు చెప్పినా.. అవి చిరు మనసును తాకలేకపోతున్నాయట. దాంతో మెగాస్టార్ ఒక నిర్ణయానికి వచ్చి.. ఇండస్ట్రీలో కొత్త పాత అనే తేడా లేకుండా కొత్త కథలు ఉంటే పట్టుకురండి అంటూ మెసేజ్ లు పాస్ చేశారు.
అసలుకే అవకాశాల కోసం అర్రులు చాస్తోన్న వేళ.. ఏకంగా మెగాస్టార్ నుండే ఇలా కాల్ వచ్చే సరికి ఇక ఎందుకు ఆగుతారు ? అందుకే ఇప్పటికే చాలామంది కొత్త డైరెక్టర్లు మెగాస్టార్ కోసం కొత్త కథలు రాయడం మొదలెట్టారు. కొంతమంది ఆల్ రెడీ చిరుకి కథలు వినిపించారు. అందులో ఒకటి రెండు చిరుకి నచ్చాయి. కానీ ఫైనల్ గా వేణు ఉడుగుల కథను ఓకే చేశారు. పైగా పవన్ కళ్యాణ్ నుంచి కూడా వేణు ఉడుగులకి పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే మరో ఇద్దరు దర్శకులు చిరుకి కథలు చెప్పడానికి రెడీ అయిపోయారు. కామెడీతో వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం ఒక అదిరిపోయే మాస్ ఎంటర్ టైనర్ ను రెడీ చేసాడు. వచ్చే వారంలో చిరును కలిసి కథ వినిపిస్తాడట. అలాగే మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా చిరు కోసం ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ రెడీ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
[…] Prabhas Radhe Shyam: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వాస్తవిక పరిస్థితి దారుణం. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఈ సినిమాని బతికించడానికి ప్రభాస్ ఫ్యాన్స్ తమ భుజానికెత్తుకున్నా.. కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. మొత్తానికి ఈ లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. […]
[…] Crazy Update On RRR2: ఆర్ఆర్ఆర్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. రాజమౌళి మెస్మరైజింగ్ మ్యాజిక్‌తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ కి త్వరలో సీక్వెల్ రాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఆర్ఆర్ఆర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. […]