‘రిపబ్లిక్’ మూవీ ప్రిరిలీజ్ వేడుక సాక్షిగా జనసేనాని పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు అటు సినీ ఇండస్ట్రీ, ఇటు ఏపీ ప్రభుత్వం షేక్ అయ్యింది. సినిమా టికెట్లు, ఆన్ లైన్ విధానం సహా సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న వైసీపీ సర్కార్ పై పవన్ కళ్యాణ్ శివాలెత్తాడు. పదునైన ప్రశ్నలతో కడిగేశాడు. సినీ ఇండస్ట్రీని తనపై కోపంతో ఇబ్బంది పెట్టవద్దని సూచించాడు.
అయితే పవన్ ప్రశ్నించిన వెంటనే వైసీపీ మంత్రులు రంగంలోకి దిగారు. పవన్ పై ముప్పేట దాడి చేశారు. ఇక తాజాగా వైసీపీకి మద్దతుగా సినీ రంగం నుంచి పలువురు రంగంలోకి దిగారు. వైసీపీని, జగన్ ను ఏమన్నా కూడా ఊరుకోని నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తాజాగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయనపై వ్యక్తిగత దాడి చేశాడు. పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు. మంత్రులు, జగన్ ను వెనకేసుకొచ్చి పవన్ పై తిట్ల వర్షం కురిపించాడు. పవన్ లేవనెత్తిన సినీ ఇండస్ట్రీ సమస్యలపై స్పందించకుండా రాజకీయాలు మాట్లాడారు.
తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
పోసాని కృష్ణమురళి ఇంటర్వ్యూ ముగియగానే ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. వైసీపీకి మద్దతుగా చెలరేగిపోతున్న వారిని ‘మొరిగే కుక్కలతో’ పవన్ పోల్చారు. అంతటితో ఆగకుండా ‘హు లైక్ ద డాగ్ సౌండ్’ అనే పాపులర్ కుక్కలపై పాటను షేర్ చేశాడు. దీనికి ‘‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. సహజమే…’’ అంటూ క్యాప్షన్ పెట్టి వైసీపీ నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
వైసీపీ మద్దతుదారులు తనపై చేస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కేవలం ఒక సామెత.. ఒక పాటతో వైసీపీ బ్యాచ్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఎండగట్టిన తీరు వైరల్ గా మారింది. వైసీపీ విమర్శకులను ‘మొరిగే కుక్కల’తో పోల్చి పవన్ గట్టి సమాధానం ఇచ్చినట్టైంది. ‘డాగ్ సాంగ్’ తన ఫేవరేట్ పాట అన్ని విమర్శలకు కేవలం ఒక్క ట్వీట్ తో పవన్ దిమ్మదిరిగే జవాబిచ్చినట్టైంది..
Baha Men – Who Let The Dogs Out (Original version) | Full HD | 1080p https://t.co/Ebyzd7tdbk via @YouTube
( This is one of my favourite song)— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pawan kalyan satires on ycp supporters criticism
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com