Pawan OG tattoo meaning : నేడు విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చింది. మామూలు ఆడియన్స్ కి కూడా చివరి షాట్ తప్పితే, ఓవరాల్ సినిమా గట్టిగానే క్లిక్ అయ్యేలా ఉందని తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్రైలర్ లో ఎవ్వరూ గమనించని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ వాటిని సూక్షంగా గమనించలేదు కానీ, వాటి వివరాలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వెయ్యాల్సిందే. ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభం లో ప్రకాష్ రాజ్ ని చంపడానికి ఒక గ్యాంగ్ వస్తుంది గమనించారా..?, పొలాలను మొత్తం కాల్చేస్తారు. అయితే ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీకై చాలా కాలం అయ్యింది. ఈ వీడియో లో మాస్క్ వేసుకొని ఒకరు అందరినీ నరుకుతూ ఉంటాడు. దానిని చూసి అందరు అకిరా నందన్ అని అనుకున్నారు.
కానీ కాదని ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇక ట్రైలర్ మధ్యలో హీరోయిన్ ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకొని, ఆ చేతి మీద ఉన్న జపనీజ్ బాషా టాటూ ని చూసి అసలు ఏమిటిది?, దీని అర్థం ఏంటి అని అడుగుతుంది. దాని అర్థం ఏంటో పవన్ కళ్యాణ్ ట్రైలర్ లో అయితే చెప్పలేదు కానీ, అభిమానులు గూగుల్ లో వెతికి చూసారు. దాని అర్థం ఏమిటంటే బ్లాక్ డ్రాగన్ అట. జపాన్ లో నిష్ణాతులైన మర్హల్ ఆర్ట్స్ కోచ్ ని అలా పిలుస్తారని సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ కోచ్ గా కూడా కనిపిస్తాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. మొత్తం మీద ఆయన క్యారక్టర్ లో మూడు షేడ్స్ ఉంటాయని టాక్. ఇకపోతే విలన్ తో ఫోన్ కాల్ లో ముంబై వస్తున్నాను, తలలు జాగ్రత్త అని అంటాడు గమనించారా?.
ఈ షాట్ తర్వాత ఆయన ఒక బస్సు దిగి రోడ్డు మీదకు ఒక చేతిలో కత్తి,మరో చేతిలో మారణాయుధాలు ఉన్న బాంబులను పట్టుకొస్తాడు. ఆ సన్నివేశం ఓజీ మళ్లీ ముంబై కి తిరిగి వచ్చే సన్నివేశమట. అంటే ఇది ఇంటర్వెల్ సన్నివేశం అయ్యుండొచ్చు. అదే విధంగా తెల్ల చొక్కా వేసుకొని విలన్స్ ని నరికే సన్నివేశం ఫ్లాష్ బ్యాక్ లో రావొచ్చని అంటున్నారు. ఈ సన్నివేశం సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ కి ఇందులో ఒక కూతురు ఉంటుంది. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ట్రైలర్ లో డిటైలింగ్స్ ఇచ్చాడు డైరెక్టర్ సుజిత్. కానీ దానిని అభిమానులకు కాస్త అర్థం కాకుండా ఇచ్చాడని అనుకోవచ్చు. సినిమాలో ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
