Pawan Kalyan OG 2 Movie Update 2026: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు గత 12 ఏళ్లలో ఒక అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ఇచ్చిన సినిమా ఏది అంటే, క్షణం కూడా ఆలోచించకుండా ‘ఓజీ'(They Call Him OG) పేరు చెప్తారు. వరుసగా రీమేక్ సినిమాలు చేస్తూ , తన బ్రాండ్ ఇమేజ్ మసకబారుతున్న సమయంలో , పవన్ కళ్యాణ్ కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. మొదటి రోజు నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా ఒక సెన్సేషన్. కొన్ని అనివార్య కారణాల వల్ల , ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా మేకర్స్ విడుదల చేయలేకపోయారు. అందుకే 320 కోట్ల గ్రాస్ వద్దనే ఆగింది , లేదంటే 500 కోట్ల గ్రాస్ మార్కుని అందుకొని ఉండేది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం దారుణమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అదే సమయం లో పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలందరూ పాన్ వరల్డ్ ని షేక్ చేసే రేంజ్ సినిమాలను సెట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తమ అభిమాన హీరో నుండి సరైన సినిమా ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు , ఓజీ 2 మొదలైతే బాగుండును అని అభిమానులు గట్టిగా కోరుకున్నారు. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ‘ఓజీ 2’ నే అని అభిమానులకు ఒక హింట్ కూడా ఇచ్చేశాడు . ఈ చిత్రాన్ని ఆయన ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ తో కలిసి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు. ముందుగా ప్రీక్వెల్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ సుజిత్. రీసెంట్ గానే ప్రీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి చేసాడట.
ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా సైలెంట్ గా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రీక్వెల్ మొత్తాన్ని జపాన్ లోనే షూట్ చెయ్యాలని అనుకుంటున్నారట. ముంబై వదిలి అజ్ఞాతం లోకి వెళ్లిన ‘ఓజాస్ గంభీర’ జపాన్ కి వెళ్లి ఏమి చేశాడు ?, ‘ఓరొచ్చి గెంషిన్’ గా మారడానికి కారణం ఏంటి?, అతని తండ్రి ఆజాద్ హిందీ ఫోజ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి?, సుభాష్ చంద్రబోస్ తో అథైనికి ఉన్న సంబంధం ఏంటి? వంటి అంశాలను ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నాడు అట సుజిత్. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి నుండే ప్రారంభించే ఆలోచన ఉందట. ఎందుకంటే నాని తో సుజిత్ ప్లాన్ చేసిన ‘బ్లడీ రోమియో’ చిత్రం మొదలు అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందట. ఎందుకంటే నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు , అనగా సెప్టెంబర్ 2 న ‘ఓజీ 2’ కి సంబంధించిన బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుందట.