Pawan Kalyan New Film Announcement: ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద చర్చనే నడిచింది. లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని, ఈమధ్యనే చర్చలు కూడా నడిచాయని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొంతమంది అయితే నేరుగా ఓజీ 2 చేస్తాడని అన్నారు, దానిపై కూడా క్లారిటీ లేదు. మరికొంతమంది అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత అసలు సినిమాలే చేయడు, ఇకపై నిర్మాతగా మాత్రమే కొనసాగుతాడని అన్నారు. ఇన్ని వార్తల మధ్య పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమా గురించి కొత్త సంవత్సరం సందర్భంగా నేడు భారీ అప్డేట్ వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్త అనే చెప్పొచ్చు.
చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అయితే నేడు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ చెప్పుకొచ్చాడు ఆ చిత్ర నిర్మాత రామ్ తళ్ళూరి. ఆయన మాట్లాడుతూ ‘జైత్ర రామ మూవీస్ బ్యానర్ ని నేడే స్థాపించాము. ఈ పేరు ని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. త్వరలోనే సురేందర్ రెడ్డి తో ఒక సినిమా నిర్మించబోతున్నాను. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది నా జీవితం లోనే డ్రీం ప్రాజెక్ట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో పవన్ కళ్యాణ్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి లుక్, అందుకోసమే అని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, లాయర్ క్యారక్టర్ చేసాడు కానీ, ఇప్పటి వరకు ఆర్మీ ఆఫీసర్ గా చెయ్యలేదు. కాబట్టి ఈ రోల్ ని ఆయన ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కి ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాలు లేకపోయినా, మంచి టాలెంటెడ్ డైరెక్టర్. సరైన కథ తగిలితే భారీ కం బ్యాక్ ఇవ్వగలడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
With folded hands and a full heart
My dream begins as Production No.1 under #JaithraRamaMovies
Named with Love & Blessings by our beloved Power Star (PSPK) ❤️
Teaming up with Surender Reddy & Vakkantham Vamsi
Forever grateful. Forever proud.
This dream project is…
— Ram Talluri (@itsRamTalluri) January 1, 2026