Pavan Kalyan Movies: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి కూడా తన ప్రత్యేకమైన స్టైల్ మరియు యాటిట్యూడ్ లో యూత్ లో ఒక్క రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..సుస్వాగతం, తొలిప్రేమ ,తమ్ముడు , బద్రి మరియు ఖుషి వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభం లోనే ఆంధ్ర ప్రదేశ్ యువతరం కి రోల్ మోడల్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్..ఆ తర్వాత ఆయన కెరీర్ లో గబ్బర్ సింగ్ సినిమా వరుకు సరైన హిట్ పడకపోయినా కూడా ఆయన క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అంటే కెరీర్ ప్రారంభం లో ఆయనకీ ఏర్పడిన ఫ్యాన్ బేస్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..పాలిటిక్స్ లోకి వెళ్లి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రాజకీయ వత్తిడులను తట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..ఇది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ అయినా సినిమాలు చాలానే ఉన్నాయి..ఒకసారి అవేంటో ఇప్పుడు చూద్దాము.

పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన బద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ద్వారానే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు..అయితే మొదటి వారం ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ ఉన్నింది అట..ఆ తర్వాత ఫుల్ రన్ లో టాక్ ఇంప్రూవ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని అందుకుంది ఈ చిత్రం..అప్పట్లోనే ఈ సినిమా 14 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..ఈ సినిమా తర్వాత విడుదల ఖుషి సినిమా మన టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఈ సినిమాకి కూడా మొదటి వారం లో ఫ్లాప్ టాక్ ఉన్నింది అట..ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర దర్శకుడు SJ సూర్య ఎన్నో ఇంటర్వూస్ లో చెప్పాడు..అలా ఫ్లాప్ టాక్ తో ప్రారంభం అయిన ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టి యూత్ ఐకాన్ లా మార్చింది.

ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో అన్నవరం సినిమాకి ఎలాంటి నెగటివ్ టాక్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫ్లాప్ అని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచింది..అప్పట్లో దాదాపుగా ఈ సినిమా 21 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట..ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా జల్సా..త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా లోని పాటలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది..కానీ విడుదలైన తర్వాత ఈ సినిమాకి భారీ అంచనాలు వల్ల డివైడ్ టాక్ వచ్చింది..ఆ డివైడ్ టాక్ తోనే అప్పట్లో ఈ సినిమా 28 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 హిట్ గా నిలిచింది..ఇక రీసెంట్ గా విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమాకి కూడా బయట డివైడ్ టాక్ నడిచింది..ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమాని అసలు ఇష్టపడలేదు..కానీ పవన్ కళ్యాణ్ స్టామినా వల్ల ఈ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా 100 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇవే పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాక్ లేకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు.

Recommende Video: