
Pawan Kalyan – Mahesh babu : సంక్రాంతి అంటేనే సినిమాలకు ఒక పెద్ద పండుగ లాంటిది.స్టార్ హీరోలందరూ తమ క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడేందుకు కాలు దువ్వుతూ ఉంటారు.ప్రతీ సంక్రాంతి లాగానే ఈ సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య మధ్య ఏరేంజ్ పోటీ ఉన్నిందో అందరికీ తెలిసిందే.ఫ్యాన్స్ ఈ పోటీ వాతావరణం ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసారు.నేటి తరం హీరోలలో ఎక్కువగా మహేష్ బాబు – రామ్ చరణ్ మధ్య సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ జరిగింది.
ఆ తర్వాత 2020 వ సంవత్సరం లో అల్లు అర్జున్ మహేష్ బాబు మధ్య జరిగింది.ఇప్పుడు మొట్టమొదటిసారి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మధ్య జరగబోతుంది.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి రాబోతుంది అని ఈరోజే ఒక అదిరిపొయ్యే పోస్టర్ ద్వారా విడుదల చేసి ప్రకటించింది మూవీ టీం.
అయితే అదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా విడుదల కాబోతుంది అని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.కేవలం క్లైమాక్స్ తప్ప, మిగిలిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి అయ్యిందట.పవన్ కళ్యాణ్ ఒక్క 30 రోజులు డేట్స్ ఇస్తే ఈ సినిమా పూర్తి అవుతుందని ఇది వరకే ఆ చిత్ర నిర్మాత AM రత్నం చెప్పాడు.ఈమధ్యనే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న మూవీని పూర్తి చేసాడు, ఏప్రిల్ 5 వ తేదీ నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
అదే నెలలో OG షూటింగ్ కూడా మొదలు కానుంది, మే నెల మొత్తం ‘హరి హర వీరమల్లు’ సినిమాకి కేటాయించి షూటింగ్ ని పూర్తి చేసి ‘వారాహి’ టూర్ ప్రారంభించనున్నాడు పవన్ కళ్యాణ్.ఈ చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి, ఇక తమ అభిమాన హీరో కి సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్న మహేష్ బాబు తో పోటీ పడితే బాక్స్ ఆఫీస్ హీట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.