Pawan Kalyan: సినిమా ఇండస్ట్రీలో పైకి రావాలి అంటే చాలా కష్టమైన పని. ఇక్కడ ఎవరో ఒక్కరి సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలవలేం అనేది వాస్తవం… అందుకే ఇండస్ట్రీ కి రావడానికి చాలా మంది భయపడతారు. అయితే ఇండస్ట్రీ లో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకి ఒకటి, రెండు ఫ్లాప్ లు వచ్చినా కూడా వాళ్లకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తానికైతే వాళ్ళు సినిమా హీరోలుగా గాని, లేదంటే ఇతర టెక్నీషియన్లుగా గానీ నిలబడగలుగుతున్నారు.
ఇక ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ద్వారా పాపులారిటిని సంపాదించుకొని సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అలాగే సినిమాల్లో అవకాశాలను కూడా సంపాదించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు కొరియోగ్రాఫర్లకి గానీ, రైటర్లకు గాని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇతర డిపార్ట్ మెంట్ వాళ్ళకి గానీ ఇక్కడ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు అయితే పడేవారు.అలాగే మన తెలుగు సినిమాలకి తమిళ్ సినిమా కొరియోగ్రాఫర్లు వర్క్ చేసేవారు. మన తెలుగు వాళ్ళకి అసలు అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ అలాంటి సమయం లో కూడా పవన్ కళ్యాణ్ హరీష్ పాయ్ కి తన సినిమాలో అన్ని సాంగ్స్ చేసే అవకాశాన్ని కల్పించాడు. తమిళ్ వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ చాలా ధైర్యం చేసి హరీష్ పాయ్ కి కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు. తమ్ముడు సినిమాతో పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని హరీష్ పాయ్ నిరూపించుకున్నాడు.
ఇక అప్పటి నుంచి వరుసగా హరీష్ పాయ్ కి కొరియోగ్రాఫర్ గా అవకాశాలు ఇస్తు వచ్చాడు. ఇక అప్పటి నుంచి తెలుగు కొరియోగ్రాఫర్లకి కూడా ఇండస్ట్రీ లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. ఇక పవన్ కళ్యాణ్ వల్ల హరీష్ పాయ్ ఒక స్టార్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కువగా కనిపించడం లేదు. ఆయన కొరియోగ్రఫీ లో కొత్తదనం లోపించడంతో ఆయనకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా పవన్ కళ్యాణ్ ఒకరి దగ్గర టాలెంట్ ఉంది అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని స్టార్లు గా మలిచాడానికి వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తు వచ్చాడు…అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీ లో అందరికి మంచి అభిమానం ఉంటుంది…