![]()
Pawan -Ram Charan : అమెరికాలో సందడి మొత్తం రామ్ చరణ్ దే. అక్కడి మీడియా, నటులు ఆయన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. పలు అంతర్జాతీయ పురస్కారాలకు ఎంపిక చేస్తున్నారు. రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనడం అరుదైన గౌరవం. రామ్ చరణ్ ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ యాక్టర్ గా రికార్డులకు ఎక్కారు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకకు ఆయన్ని అతిథిగా ఆహ్వానించారు. రామ్ చరణ్ చేతుల మీదుగా బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ అవార్డును ఆయన చేతుల మీదుగా విజేతకు అందజేశారు. అలాగే రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుకు ఎంపిక చేశారు.
ఈ క్రమంలో భారతీయ చిత్ర ప్రముఖులు రామ్ చరణ్ విజయాలను అభినందిస్తున్నారు. ఆయనకు దక్కుతున్న అంతర్జాతీయ గుర్తింపు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ని అభినందించారు. ”రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. అతని పీరియడ్ నడుస్తుంది” అని ట్వీట్ చేశారు. దానికి రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు. ‘ధన్యవాదాలు సర్. భారతదేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతుంది. ప్రతి రంగంలో విజయం సాధించాల్సి ఉంది’ అని ట్వీట్ చేశారు.

ఇక అబ్బాయి ఎదుగుదలను చూసి బాబాయ్ పవన్ కళ్యాణ్ మురిసిపోతున్నారు. ఆయన జనసేన అధినేతగా అభినందిస్తూ అధికారిక లెటర్ హెడ్ విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్… రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ వేడుకకు అతిథిగా హాజరు కావడం, అవార్డులు ప్రధానం చేయడం గొప్ప పరిణామం అన్నారు. అలాగే స్పాట్ లైట్ అవార్డు అందుకున్నందుకు ప్రశంసించారు. మరిన్ని అత్యున్నత గౌరవాలు భవిష్యత్ లో అందుకోవాలని కాంక్షించారు.
ఒక్కసారిగా రామ్ చరణ్ పేరు వరల్డ్ వైడ్ మారుమ్రోగుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామరాజు పాత్రతో ఆయన ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. ఆల్రెడీ నాటు నాటు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుంది. ఈ క్రమంలో నాటు నాటు సాంగ్ కచ్చితంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటుందని పలువురు భావిస్తున్నారు. ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అమెరికన్ మీడియా ఆయన్ని ప్రత్యేకంగా కవర్ చేసే అవకాశం కలదు.
https://twitter.com/RcYuvaShakthi/status/1629334225194450945?s=20