HBD Pawan Kalyan: సింహం నడిచొస్తుంటే… మైండ్ బ్లాక్ చేసేలా హరి హర వీరమల్లు పోస్టర్!

శత్రువులను చెండాడుతూ నడిచి వస్తున్న పవన్ కళ్యాణ్ మేనరిజం గూస్ బంప్స్ లేపుతుంది. ఆయన పీరియాడిక్ లుక్ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరి హర వీరమల్లు నుండి ఆయన లుక్ చూసి ఫిదా అవుతున్నారు.

Written By: Shiva, Updated On : September 2, 2023 8:21 am

HBD Pawan Kalyan

Follow us on

HBD Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఆయన జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు జరుపుకుంటున్నారు. గత నెల రోజులుగా పవన్ కళ్యాణ్ జన్మదినంపై సందడి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిత్రాల అప్డేట్స్ ఒక్కొక్కటిగా కిక్ ఇస్తున్నాయి. చెప్పినట్లే హరి హర వీరమల్లు నుండి పోస్టర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఫెరోషియస్ లుక్ ఆకట్టుకుంటుంది.

శత్రువులను చెండాడుతూ నడిచి వస్తున్న పవన్ కళ్యాణ్ మేనరిజం గూస్ బంప్స్ లేపుతుంది. ఆయన పీరియాడిక్ లుక్ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హరి హర వీరమల్లు నుండి ఆయన లుక్ చూసి ఫిదా అవుతున్నారు. హరి హర వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకుడు. భారీ చిత్రాల నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్ర చేస్తున్నారు. మొఘలులను ఆటాడించే బందిపోటుగా ఆయన కనిపించనున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే మంచిదొంగగా ఆయన పాత్ర స్వభావం ఉంటుందట. అనుకోని కారణాలతో హరి హర వీరమల్లు ఆలస్యం అవుతూ వస్తుంది. కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జరగాల్సి ఉంది. మరో పది నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండగా… హరి హర వీరమల్లు షూటింగ్ వచ్చే ఏడాదే అంటున్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరో కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఓజీ ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా అప్డేట్ ఉంది…