Ustad Bhagat Singh: మరో నెల రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustad Bhagat Singh) చిత్రం విడుదల కాబోతుంది. ‘ఓజీ’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఓజీ కి ఎలాంటి క్రేజ్, హైప్ ఉండేదో, అలాంటి క్రేజ్ ఈ చిత్రానికి రావడం లేదు అనేది వాస్తవం. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా అనే హైప్ తప్ప, సినిమా పరంగా ఒక్కటంటే ఒక్క కంటెంట్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచలేదు. మరోపక్క డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి ‘ఓజీ’ రేంజ్ క్రేజ్ ని తీసుకొని రావడానికి నానా తంటాలు పడుతున్నాడు. కానీ ఆ రేంజ్ హైప్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోతుంది ఈ చిత్రం. అదే హరీష్ శంకర్ ని తీవ్రమైన అసహనానికి గురి చేస్తుందట.
కాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట విడుదల కాబోతుంది. కానీ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ కి చేసినంత హడావిడి ఈ చిత్రానికి చేయడం లేదు. అదే డైరెక్టర్ హరీష్ శంకర్ కి అసలు నచ్చడం లేదు. మా సినిమా ‘ఓజీ’ చిత్రం కంటే చాలా అద్భుతంగా వచ్చింది. కానీ అభిమానులు ఆ రేంజ్ లో సహకరించడం లేదు అంటూ హరీష్ శంకర్ రీసెంట్ గా తనని కలిసిన కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల ముందు ఆవేదన వ్యక్తం చేసాడట. అయితే అభిమానులు చెప్పేది ఒక్కటే. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా అంటూ భారీ సినిమాలు చేస్తున్న రోజులివి. నిన్నమొన్నటి వరకు మహేష్ బాబు కూడా ప్రాంతీయ బాషా చిత్రాలు చేస్తుండేవాడు. కానీ ఆయన కూడా ఇప్పుడు ‘వారణాసి’ తో పాన్ ఇండియా కి వెళ్ళిపోతున్నాడు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే, మీడియం రేంజ్ హీరోలు కూడా కొత్త రకం కాన్సెప్ట్స్ తో పాన్ ఇండియా కి వెళ్తున్నారు.
ఇలాంటి సమయం లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి రొటీన్ కమర్షియల్ మూవీ పై ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు చెప్పండి అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఈ చిత్రానికి ముందు విడుదలైన ఓజీ ని చూసిన కళ్ళతో, ఉస్తాద్ లాంటి రొటీన్ సినిమాని చూడగలమా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు వీరాభిమానులు కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం అభిమానుల్లో ఉత్సాహం కలిగించే ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా విడుదల చేయలేదు , అందుకే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ రాలేదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్. నేడు విడుదల చేసే సాంగ్ చార్ట్ బస్టర్ అయితే కచ్చితంగా ఈ చిత్రం పై అంచనాలు ఒక్కసారిగా పెరుగుతాయని అంటున్నారు.