Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలు కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతం మొత్తం నీట మునిగింది. ఇలాంటి విపత్కర సమయంలో ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గా పరిస్థితులను మొత్తం అదుపులో పెట్టేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు తియ్యిస్తూనే, మరోపక్క తనవంతు సహాయంగా విరాళం ప్రకటించాడు. నిన్ననే ఆయన ఆంధ్ర ప్రదేశ్ సహాయ నిధికి కోటి రూపాయిలు ప్రకటించగా, నేడు తెలంగాణ కి మరో కోటి రూపాయిల విరాళంని ప్రకటించాడు. అంతే కాకుండా 400 పంచాయితీలు ఈ వరదల్లో మునిగిపోయాయి.
గత మూడు రోజులుగా తన యంత్రాంగాన్ని మొత్తం అలెర్ట్ చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న పవన్ కళ్యాణ్, తన వంతు సహాయంగా వరదల్లో చిక్కుకున్న 400 పంచాయితులకు లక్ష రూపాయిల చొప్పున విరాళం ప్రకటించాడు. అంటే ఒక్కో పంచాయితీకి లక్ష రూపాయిలు ఆయన ఖర్చు చేయనున్నాడు. తాను మాత్రమే కాకుండా తన పంచాయితీ రాజ్ శాఖలో ఉన్నటువంటి టీం మొత్తం తో 14 కోట్ల రూపాయిలు సీఎం సహాయ నిధికి అందించాడు పవన్ కళ్యాణ్. ఇది సాధారణమైన విరాళం కాదు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసి, ఆయనకీ కోటి రూపాయిల విరాళం అందించబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ని సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకపక్క వైసీపీ పార్టీ వరదలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటే, మరోపక్క పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా జనాల కోసం పని చేస్తూ, ప్రభుత్వం తరుపున మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా జనాలకు అండగా నిలబడ్డాడు.
నిజానికి పవన్ కళ్యాణ్ వద్ద పెద్దగా డబ్బులు ఉండవు, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లు చూస్తే ఆయన దగ్గర ఉన్న ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ ఉంటాయి. సినిమాలు కూడా అందరు హీరోలు లాగా రెగ్యులర్ గా చేయడు. రెండేళ్లకు ఒకసారి మాత్రమే ఆయన ఈమధ్య వెండితెర మీద కనిపిస్తున్నాడు. అలా తక్కువ డబ్బులను తన బ్యాంక్ అకౌంట్ లో మైంటైన్ చేసే పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేసినట్టుగా అనిపిస్తుంది. వేల కోట్లు సంపాదిస్తున్న ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కనీసం కోటి రూపాయిలు తమ సొంత జోబిల్లోంచి తియ్యడానికి ఇష్టపడడం లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇంత డబ్బులు విరాళం ప్రకటించడం మామూలు విషయం కాదు. అభిమానులు ఆయన ఇంత డబ్బులు ప్రకటించగానే, సినిమాలు రెగ్యులర్ గా చెయ్యి అన్నా, నువ్వు సినిమాలు చేయకపోతే ఇంత డబ్బు సహాయం చేయలేవు, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏడాదికి ఒక సినిమా కచ్చితంగా చెయ్యాల్సిందే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.