Pawan Kalyan next movie : ‘ఓజీ'(They Call Him OG) తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan), తర్వాత ఏ సినిమా చేస్తాడు?, ఓజీ తో హై క్వాలిటీ సినిమాని ఫ్యాన్స్ కి అందించిన పవన్ కళ్యాణ్, అదే రేంజ్ క్వాలిటీ సినిమా చేస్తాడా?, లేకపోతే ఇంతకు ముందు లాగా మామూలు రేంజ్ సినిమాలు చేస్తాడా? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఓజీ తర్వాత ఆయన నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇది ఒక మామూలు కమర్షియల్ సినిమా, దీనికి ఓజీ రేంజ్ హైప్ రావడం కష్టమే. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ కనకరాజ్ తో చేస్తాడని కొందరు, లేదు డైరెక్ట్ గా ఓజీ ప్రీక్వెల్ చేస్తాడని మరికొందరు, ఇవి రెండు కాకుండా తమిళ డైరెక్టర్ H వినోద్ తో ఒక యాక్షన్ జానర్ సినిమా చేస్తాడని మరికొందరు కామెంట్ చేశారు.
కానీ ఓజీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కి వచ్చిన దిల్ రాజు, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు కాబట్టి కచ్చితంగా అనిల్ రావిపూడి తో సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు కూడా వినిపిస్తుంది. గతం లో దిల్ రాజు నిర్మాణం లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని పెట్టి ఒక సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కథతోనే పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో నుండి బలంగా వినిపిస్తున్న టాక్. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ముందు దిల్ రాజు వైపు రెండు ఛాయస్ లు ఉన్నాయి. ఒకటి అనిల్ రావిపూడి తో సినిమా. ఇందులో పవన్ లెక్చరర్ రోల్ లో కనిపించబోతున్నాడు.
మరొకటి వంశీ పైడిపల్లి తో సినిమా, ఇది వకీల్ సాబ్ తరహా లో ఉంటుంది. ఏది ఎంచుకొని ముందుకు వేళ్తాడో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పవన్ అభిమానులు అయితే అనిల్ రావిపూడి తో సినిమా చేయమని సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకంటే అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం మానేశారు. వకీల్ సాబ్ చిత్రాన్ని చూసేవారు కానీ, ఆ సమయం లో కరోనా సెకండ్ వేవ్ చాలా పీక్ గా ఉండడంతో థియేటర్స్ ని మూసి వేయాల్సి వచ్చింది. ఇక ఓజీ సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ అది కేవలం యూత్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైన సినిమా. కాబట్టి ఒక అనిల్ తో ఎంటర్టైనర్ చేస్తే మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ పవన్ సినిమాకు వస్తారని, వంశీ పైడిపల్లి అవుట్ డేటెడ్ డైరెక్టర్, అతనితో సినిమా వద్దని అంటున్నారు. మరి పవన్ నిర్ణయంలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.