Mega Family Diwali Celebration: పవన్ కల్యాణ్ నిన్నా.. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా కనిపించారు.. కానీ దీపావళి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో హ్యాపీగా కనిపించారు. వెలుగుల పండుగ సందర్భంగా పవన్ కుటుంబ సభ్యులు ఈ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ దీపావళి సందర్భగా ఆయన వారసులు ఒక్కచోట కనిపించడం విశేషం. ఒకరు రేణుదేశాయ్ కుమారుడు అఖీరా నందన్ కాగా.. అన్నాలెజినోవా వారసులు పోలెనా, మార్క్ శంకర్ లు కలిసి సందడి చేశారు. వీరంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడిపారు. ఇక వీరిని కలిసేందుకు మెగాస్టార్ కుటుంబ సభ్యులతో కలిసి పవన్ ఇంటికి వచ్చారు. పవన్ వారసులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. వారిలో అన్నాలెజినోవా కుమారుడిని ఎత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

రాజకీయంగా చిరు, పవన్ ఉద్దేశాలు వేరే. కానీ ప్రతీ పండుగ సందర్భంలో మెగాస్టార్ ఫ్యామిలీ ఒక్కచోటుకు చేరుతుంది. చిరు, పవన్ తో పాటు నాగబాబు కూడా వీరికి తోడవుతున్నారు. ఈసారి కూడా ముగ్గురు అన్నదమ్ములు ఒక్కచోటుకు చేరారు. ఈ పండుగ చిరంజీవికి ప్రత్యేకమనే చెప్పాలి. ఓవైపు గాడ్ ఫాదర్ హిట్టుతో మంచి జోష్ లో ఉన్న చిరుకు ‘వాల్తేరు వీరయ్య’ టీజర్ రిలీజ్ తో మరింత ఖుషీగా ఉన్నారు. ఈ టీజర్ రిలీజ్ తో అటు ఫ్యాన్స్ లో సందడిని నింపారు. ఈ టీజర్ ను చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఠామేస్త్రీ లెవల్లో చిరు కనిపించడంతో మెగా మూవీ అదిరిపోతుందని అనుకుంటున్నారు.

అటు పవన్ కూడా రాజకీయాలతో పాటు ‘హరిహర వీరమల్లు ’మేకింగ్ లో బిజీ అయ్యారు. ఇప్పటికే కంటిన్యూ షెడ్యూల్ ప్రకటించడంతో తీరికలేకుండా రెండు పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఫెస్టివల్ సందర్భంగా ఆయన ఎంతోకూల్ గా కనిపించడం ఆకట్టుకుంది. మొన్న విశాఖలో ఆగ్రహంతో ఊగిపోయిన పవన్ కు .. దీపావళి రోజున చూసిన పవన్ కు చాలా తేడా ఉంది. ఎక్కడి విషయాలు అక్కడే పెట్టాలి.. అనేదానికి నిదర్శనం అంటూ పవన్ పై కొన్ని పోస్టులు పెడుతున్నారు.