https://oktelugu.com/

Pawan Kalyan-Prabhas: ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఇద్దరు ఇద్దరే…వీళ్ళను మించినవారు లేరు…

ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్...

Written By:
  • Gopi
  • , Updated On : May 17, 2024 / 02:17 PM IST

    Pawan Kalyan and Prabhas

    Follow us on

    Pawan Kalyan-Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్.. ఇక తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆదరించడమే కాకుండా చాలామంది అభిమానులు ఆయనకు భక్తులుగా కూడా మారిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉంటున్నా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రభాస్…ఈయన కూడా తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తనను మించిన నటుడు ఇండియా లో మరొకరు లేరు అనేంతలా రెచ్చిపోయి నటిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ వసూళ్లను రాబడుతున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇద్దరి మధ్య కొన్ని కామన్ ఎలిమెంట్స్ ను అయితే అభిమానులు ఇష్టపడుతున్నారు.

    అవి ఏంటి అంటే ఈ స్టార్ హీరోలకి యాడ్స్ చేస్తే కొన్ని కోట్లలో డబ్బులు వస్తాయి. అయినప్పటికీ వాటిని ఎంకరేజ్ చేయడం లేదు ఎందుకంటే వాళ్లు యాడ్ ఫిల్మ్స్ కనక చేసినట్లయితే వాటిని వాళ్ల అభిమానులు కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి ఆయా యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఒకవేళ వీళ్ళు ఓకే అంటే మాత్రం దాదాపు వీళ్లకు సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల వరకు యాడ్స్ రూపంలో వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి కోకో కోలా యాడ్ కోసం బాలీవుడ్ బాద్షా అయిన షారుక్ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఆయన యాడ్ ఫిల్మ్ లో అయితే నటించలేదు. ఎందుకంటే వాళ్లకు కొన్ని మోరల్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. వాళ్లని ఇంత పెద్ద స్టార్లుగా మలిచిన అభిమానులకు మనం హాని చేయకూడదనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు అలా చేస్తున్నారని తెలుస్తుంది…అందుకే వీళ్ళిద్దరికీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది…