
Pawan Harish Movie : పవర్ స్టార్ అనే నేమ్ రాబోయే రెండేళ్లూ ట్రెండింగ్ లోనే ఉండబోతోంది. వకీల్ సాబ్ తో మొదలైన జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా.. ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం.. సోషల్ మీడియాలో దుమ్ములేపడం తెలిసిందే. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి స్లాట్ బుక్ చేసుకుంది. దీని తర్వాత ‘‘హరిహర వీరమల్లు’’ బాక్సాఫీస్ ను ఊచకోత కోయబోతున్నాడు. ఆ తర్వాత లైన్లో ఉన్న చిత్రం హరీష్ శంకర్ మూవీ. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కిర్రాక్ అనిపించగా.. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ కాక రేపుతోంది.
దర్శకుడు హరీష్ శంకర్ పై పవన్ అభిమానులకు ఎప్పటికీ స్పెషల్ కన్సర్న్ ఉంటుంది. అవును మరి.. అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కు.. ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరీష్. అందుకే.. ఆయనపై ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తుంటారు. అలాంటి.. ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతోందని తెలిసినప్పటి నుంచి.. రాబోయే మూవీ గబ్బర్ సింగ్ కా బాప్ కావాలని ఆశిస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూట్ 40 శాతం పూర్తయ్యింది. భీమ్లా నాయక్ జోరు మీదుంది. సాధ్యమైనంత త్వరగా ఈ రెండు చిత్రాలను కంప్లీట్ చేయాలని పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కాగానే.. పవన్ 28వ చిత్రంగా.. హరీష్ శంకర్ సినిమా మొదలు కానుంది. అయితే.. ఈ చిత్రం ఎలాంటి కథతో రూపొందనుందనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇచ్చిన హరీశ్.. పవన్ ఎలా చూపించబోతున్నాడని ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.
ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ఓ నేషనల్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సూపర్ డూపర్ స్క్రిప్టుతో తెరకెక్కబోతోందని చెప్పాడు అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందన్న డీఎస్పీ.. ఈ సినిమాకు సంబంధించి తాను రెండు పాటలు కంపోజింగ్ కూడా పూర్తి చేసినట్టు చెప్పాడు.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు పవన్ ఇలాంటి పాత్ర చేయలేదు. దీంతో.. అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక, ఇలాంటి సినిమాకు రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్టు సమాచారం. ఇందులో ఒకటి ‘సంచారి’ కాగా.. మరొకటి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ గా తెలుస్తోంది. ఈ రెండు టైటిళ్లలో ఏది పెట్టినా.. దుమ్ము లేచిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. మరి, ఏది ఫైనల్ అవుతుందన్నది చూడాలి.