Pathan Collections: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో బాక్స్ ఆఫీస్ రేస్ లో బాగా వెనకబడి, నాలుగేళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు ‘పఠాన్’ సినిమాతో మన ముందుకొచ్చి ఆయన సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ఊపు చూస్తూ ఉంటె వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కాదు..బాహుబలి 2 రికార్డ్స్ ని కొల్లగొట్టి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇది సాధారణమైన విషయం కాదు..ఇదే ఊపుని ఈ వారం మొత్తం కొనసాగిస్తే పది రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది పఠాన్.
షారుఖ్ ఖాన్ పని ఇక అయిపోయింది..క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయిపోవడం మంచిది వంటి కామెంట్స్ ఈ సినిమాకి ముందు బాగా వినిపించేవి..ఎందుకంటే 2014 వ సంవత్సరం లో విడుదలైన చెన్నై ఎక్సప్రెస్ తర్వాత షారుఖ్ ఖాన్ కి సరైన హిట్ లేదు..ముట్టుకున్న ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలేది..ఒకానొక్క దశలో అభిమానులకు సైతం షారుఖ్ మీద చిరాకు కలిగింది.

అలాంటి స్థాయి నుండి నేది పది రోజుల్లో వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరేంత రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడంటే షారుఖ్ ఖాన్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు..ఆరు రోజులకు 600 కోట్లు రాబట్టిన ఈ సినిమాకి , మొదటి వారం వసూళ్లు ఫైనల్ గా 650 కోట్ల రూపాయలకు టచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి అయితే చాలా తేలికగా చేరిపోతుంది..మరి బాహుబలి 2 ని కొడుతుందా లేదా అనేది చూడాలి.