Papam Pratap Twitter Talk: ‘ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల్లో నెమ్మదిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్న హీరో తిరువీర్. ‘జార్జ్ రెడ్డి’, ‘టక్ జగదీశ్’ వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు ని సంపాదించుకున్న తిరువీర్, ఆ తర్వాత ‘మాసూద’ చిత్రం తో హీరోగా మారి భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ‘పరేషాన్’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఇది అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు కానీ , ఆయన గత చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ‘తిరువీర్’ చిత్రాలు బాగానే ఉన్నాయి , కొత్తగా ప్రయత్నం చేస్తున్నాడు అనే పేరు బలంగా వచ్చింది. ఆ కారణం చేతనే ఆయన లేటెస్ట్ చిత్రం ‘పాపం ప్రతాప్’ కి ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
@etvwin meru content baga select chestaru anukuna, daya chesi #papamprathap lanti movies tesi me banner lo content movies meda bad remark enduku andi@iamThiruveeR you did an excellent job do you think it makes sense for the plot to extend 2 hours plus on something with no sense
— Jagadeesh PS (@achilles_talks) April 17, 2026
హైదరాబాద్ లో నిన్న ప్రీమియర్ షోస్ ని ఏర్పాటు చేయగా, టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. విడుదలకు ముందు తిరువీర్ తో పాటు మూవీ టీం కూడా ప్రొమోషన్స్ వేరే లెవెల్ లో చేయడం వల్ల, ఈ చిత్రానికి కావాల్సినంత బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఆ బజ్ కి తగ్గట్టుగా సినిమా ఉందా లేదా?, మరో ప్రామిసింగ్ మూవీ ని తిరువీర్ అందించాడా లేదా అనేది ఇప్పుడు ట్విట్టర్ రివ్యూస్ ద్వారా ఒకసారి చూద్దాం. ట్విట్టర్ రివ్యూస్ ని బట్టి చూస్తే , ఈ చిత్రం ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు నెటిజెన్స్. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గానే ఉంది కానీ , హీరో తిరువీర్, అజయ్ ఘోష్ నటన బాగానే ఉంది కానీ , సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు ల్యాగ్ చేశారని , ఎమోషన్స్ అనుకున్నంత స్థాయిలో పండలేదని అంటున్నారు.
Walkout… https://t.co/BXIVKnegKK
— . (@mass_boy1) April 17, 2026
ఒక్క చిన్న పాయింట్ ని పట్టుకొని , చివరి వరకు సాగదీశారని, ఈ చిత్రానికి అంత అవసరం లేదని అంటున్నారు. ఈటీవీ విన్ నుండి ఒక కంటెంట్ వస్తుందంటే, కచ్చితంగా బాగుంటుంది అని అంతా అనుకుంటారు. ఎందుకంటే గతం లో వాళ్ళ నుండి అలాంటి సినిమాలు , వెబ్ సిరీస్ లు వచ్చాయి కాబట్టి. కానీ ఇలాంటి సినిమాలు తీసి మీ బ్రాండ్ ఇమేజ్ ని చెడకొట్టుకోకండి అంటూ కొంతమంది నెటిజెన్స్ ట్యాగ్ చేసి మరీ చెప్తున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్ ఆడియన్స్ నుండి వస్తున్న రివ్యూస్ ని చూస్తుంటే , ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యినట్టుగానే అనిపిస్తుంది. కానీ టికెట్ ని కేవలం 99 రూపాయలకు మాత్రమే అందించడం వల్ల, తిరువీర్ కి ఆడియన్స్ లో గుడ్ విల్ ఉండడం తో , వీకెండ్ వరకు మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
A genuine feel good movie with entertainment and emotions.
The first half feels light and easy, with nice romance and fun moments, leading to an emotional interval. In the second half, the story gets deeper with a strong backstory, a touching father angle, ends… https://t.co/OM9A7j2DWb
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 17, 2026