Panjaa Re Release: ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఏ రేంజ్ లో చేస్తారో అందరికీ తెలిసిందే. సేవాకార్యక్రమాలు , కేక్ కట్టింగ్స్ వంటి వాటితో పాటు , ఈమధ్య మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ లో , తమ అభిమాన హీరోకి సంబంధించిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను లేటెస్ట్ టెక్నాలజీ కి మార్చి , గ్రాండ్ పద్దితిలో విడుదల చేసి థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. అలా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన రీ రిలీజ్ చిత్రాల్లో జల్సా, ఖుషి , గబ్బర్ సింగ్ చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ ని కొల్పాయి. ఆ స్థాయిలో ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘పంజా’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రమిది. ఆరోజుల్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు, కానీ నేటి తరం ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ హీరో తరహా లుక్స్ తో , ఎంతో స్టైలిష్ గా , పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో అద్భుతంగా నటించాడు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘ఓజీ’ కంటే , ఈ సినిమానే అద్భుతంగా ఉంటుందనే అభిమానులు చాలా మంది ఉన్నారు. మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాని వేరే లెవెల్ లో ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని కైలాష్ ఫిలిమ్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది.
రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని సెన్సార్ చేయించారు. రేపటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ఈ ట్రైలర్ సెప్టెంబర్ 1 వరకు ప్రదర్శితం కానుంది. అంతే కాదు , సెకండ్ హాఫ్ ని రీ ఎడిటింగ్ కూడా చేయబోతున్నారట. ప్రతీ థియేటర్ లోను ఈ చిత్రానికి సంబంధించిన స్టాండీస్ ని పంపుతారట. అంతే కాకుండా ఇంటర్వూస్ కూడా ఇస్తారట మేకర్స్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మూవీ టీం తో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారట, రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా కటౌట్ లాంచ్ ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారట. ఈ రేంజ్ ప్లానింగ్ ఈమధ్య కాలంలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా జరగలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
