
OG Sensation : పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం ‘#OG’.ప్రముఖ యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ నిన్ననే ముంబై లో ప్రారంభం అయ్యింది.పవన్ కళ్యాణ్ రేపటి నుండి మొదటి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు.ఈ సందర్భంగా మేకర్స్ స్క్రిప్ట్ మేకింగ్ వీడియో ని ఒక క్రేజీ ఐడియా తో, క్రేయాన్ స్కెచెస్ తో థమన్ అదిరిపొయ్యే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన వీడియో ని నిన్న విడుదల చేసారు.
ఈ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.పవన్ కళ్యాణ్ ని ఇన్ని రోజులు అభిమానులు ఎలా అయితే చూడాలని ఆశపడ్డారో, అలా చూపించబోతున్నాను అని తన మేకింగ్ వీడియో తోనే చెప్పేసాడు డైరెక్టర్ సుజిత్.ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఈ వీడియో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పబోతుంది, నిన్న డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ మేకింగ్ వీడియో ని విడుదల చేసారు.ఈ వీడియో కి 24 గంటలు గడవక ముందే అప్పటి వరకు షూటింగ్ ప్రారంభ ప్రకటన వీడియోస్ అన్ని లైక్స్ ని దాటేసి సరికొత్త రికార్డు ని సృష్టించింది.పాన్ వరల్డ్ షూటింగ్ ప్రారంభ వీడియోస్ కి కూడా ఈ రేంజ్ రీచ్ రాలేదు.
రియల్ టైం వ్యూస్ కూడా ఇప్పటికే రెండు మిలియన్ కి పైగానే దాటింది.పవన్ కళ్యాణ్ లేకుండా కేవలం డైరెక్టర్ తోనే ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తే, ఇక రాబొయ్యే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఉండే వీడియోస్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ రాబోతుందో ఊహించుకోవచ్చు.సుజిత్ సినిమా అంటేనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్, మరి ఆయన పవన్ కళ్యాణ్ తో తియ్యబోయ్యే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఎలా కొల్లగొడుతాడో చూడాలి.