Pakka Commercial Huge Losses: యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా క్రేజీ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ చెయ్యడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..దానికి తోడు ఈ సినిమాకి నిర్మాత అల్లు అరవింద్ కావడం తో మినిమం గ్యారంటీ మూవీ అవుతుందని అందరూ అనుకున్నారు..కానీ విడుదలైన తర్వాత ఈ అంచనాలు అన్నీ తలక్రిందలు అయ్యాయి..గోపీచంద్ కెరీర్ లోనే వీక్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలలో ఒక్కటిగా ఈ సినిమా కూడా నిలిచి పోయింది..డైరెక్టర్ మారుతీ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఏ మాత్రం నవ్వించకపోవడం..పాటలు ఒక్కటి కూడా సరిగా లేకపోవడం ఈ సినిమా పై ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది..అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి గోపీచంద్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలివబోతుంది ఈ సినిమా.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 20 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..కానీ తొలి మూడు రోజులు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే ఫుల్ రన్ లో కనీసం 10 కోట్ల రూపాయిల షేర్ ని కూడా దక్కించుకునే అవకాశం కనిపించడం లేదు..ప్రేక్షకులు ఇప్పుడు OTT కి బాగా అలవాటు పడిపోయారు..ఈ OTT కాలం లో థియేటర్స్ కి కదిలి రావాలంటే వాళ్ళని ఎదో ఒక్క తెలియని అంశం బాగా ఆకర్షించాలి..అలా ఆకర్షించకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది..ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన అంటే సుందరానికి సినిమా కి కూడా ఇదే జరిగింది..టాక్ అద్భుతంగా వచ్చినప్పటికీ కూడా..సరైన హైప్ ని ఆడియన్స్ లో సృష్టించకపోవడం తో కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది..30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ చిత్రం కేవలం 20 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టి బయ్యర్స్ కి 10 కోట్ల రూపాయిల నష్టం రాబట్టింది..ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా అయితే కనీసం పది కోట్ల రూపాయిలు కూడా వసూలు చేసే అవకాశం లేక డబుల్ డిసాస్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద అడుగులు వేస్తుంది.

Also Read: Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు
Recommended Videos



[…] […]