Pakistan Appreciates NTR: పాకిస్థాన్ లో ఇండియన్ సినిమా హిట్ అవ్వడం అనేది అసాధ్యం. కానీ, అది సాధ్యం అయ్యింది. పైగా, ఒక తెలుగు సినిమాతో అది సాధ్యం అవ్వడం నిజంగా గర్వకారణమే. సహజంగా మన సినిమాలను పాకిస్థాన్ లో అస్సలు చూడరు. కానీ ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఏ సినిమా బాగున్నా.. ఆ సినిమాని అన్ని దేశాల వారు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీలో కొత్త సంచలనాలు నమోదు చేస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు. దాంతో పాకిస్థాన్ లో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పాకిస్థాన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రం మొదటివారంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందంటే.. గొప్ప విషయమే. అలాగే పలుదేశాల్లోనూ నెట్ ఫ్లిక్స్ లో ఇదే రకమైన స్పందన దక్కించుకుంటోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్రం నెట్ ఫ్లిక్స్ కి బాగానే కలిసొచ్చేలా ఉంది.
ఈ సినిమా చూసి.. విదేశీయులు ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తూ మెచ్చుకుంటున్నారు. యుకె, యుఎస్, లండన్, ఆస్ట్రేలియా తదితర చోట్ల నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకు చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఎన్టీఆర్ కి ప్రస్తుతం దక్కుతున్న గ్లోబల్ అప్రిసియేషన్ చాలా విలువైనది.

Also Read: Nayantara Marriage: హీరోయిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి.. కుల దైవం గుడిలో పూజలు !
‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అయ్యారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజుల్లోనే టోటల్ వరల్డ్ వైడ్ గా 501.74 కోట్లు కలెక్ట్ చేసింది.
అంటే.. పదో రోజు నుంచి ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్నీ లాభాలు కింద లెక్కే. ఒక తెలుగు సినిమా ఫస్ట్ టెన్ డేస్ కలెక్షన్స్ లో కూడా ఈ రేంజ్ ఫిగర్ ను నెలకొల్పడం సరి కొత్త రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. అసలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. ప్రపంచ సినీ లోకమంతా షాక్ అయిపోయింది.
Also Read: Puri Jagannadh: సీరియల్ గా తియ్యాల్సిన స్టోరీ ని సినిమాగా తీసి సెన్సేషనల్ హిట్ కొట్టిన పూరి జగనాథ్
Recommended videos



[…] […]
[…] […]