https://oktelugu.com/

మా నిశ్చితార్థం మీడియానే చేసింది.. సింగ‌ర్‌ సునీతారామ్

బ‌హుశా సింగ‌ర్ సునీత మ్యారేజ్ త‌ప్ప‌, మ‌రే ఇత‌ర సెల‌బ్రిటీల పెళ్లి విష‌యంలోనూ ఈ స్థాయి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. కార‌ణం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవ‌డ‌మే. మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్నా చాలా సంవ‌త్స‌రాల తర్వాత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీర‌ప‌నేని చెయ్యి ప‌ట్టుకున్నారు సునీత‌. ఈ క్ర‌మంలో మీడియాలో, అటు సోష‌ల్ మీడియాలో ఏ స్థాయిలో చ‌ర్చ జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఇద్ద‌రూ క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చారు సునీతారామ్‌. Also […]

Written By:
  • Rocky
  • , Updated On : February 18, 2021 / 04:30 PM IST
    Follow us on


    బ‌హుశా సింగ‌ర్ సునీత మ్యారేజ్ త‌ప్ప‌, మ‌రే ఇత‌ర సెల‌బ్రిటీల పెళ్లి విష‌యంలోనూ ఈ స్థాయి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. కార‌ణం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవ‌డ‌మే. మొద‌టి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్నా చాలా సంవ‌త్స‌రాల తర్వాత మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీర‌ప‌నేని చెయ్యి ప‌ట్టుకున్నారు సునీత‌. ఈ క్ర‌మంలో మీడియాలో, అటు సోష‌ల్ మీడియాలో ఏ స్థాయిలో చ‌ర్చ జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఇద్ద‌రూ క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చారు సునీతారామ్‌.

    Also Read: అభిమానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సాయం

    పెళ్లి త‌ర్వాత ఎలాంటి వెకేష‌న్ కూ వెళ్ల‌ని ఈ జంట‌.. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా హ‌నీమూన్ ట్రిప్ వేశారు. సెలబ్రిటీల హాలిడే డెస్టినేష‌న్ గా మారిన మాల్దీవుల‌కే వీరు కూడా వెళ్లారు. అక్క‌డ తాము ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నామో.. త‌మ ఫొటోల ద్వారా చెప్పేశారు సునీత‌. కాగా.. ఇటీవ‌లే యాంక‌ర్ సుమ‌తో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు భార్యాభ‌ర్త‌లు. ఈ సంద‌ర్భంగా త‌మ పెళ్లి ప్ర‌పోజ‌ల్ నుంచి పెళ్లి వ‌ర‌కు మాట్లాడారు.

    ఈ ఇంట‌ర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. ‘‘పెళ్లిపై తనకు ఏడేళ్లుగా హింట్ ఇస్తూనే ఉన్నాను. కానీ సునీత అర్థం చేసుకోలేదు. ఫోన్ చేసిన ప్రతిసారీ.. ”ఇంకేంటి” అని అడిగేవాడ్ని. కానీ.. సునీతకు అర్థమయ్యేది కాదు. కొన్నిసార్లు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేసేది కాదు. అయితే.. లాక్ డౌన్ వల్ల దగ్గరయ్యాం’’ అని చెప్పారు.

    సునీత స్పందిస్తూ.. ‘‘ఓసారి ఫోన్లో ప్రొఫెషనల్ గా ఏదో మాట్లాడుతుండగా.. ”ఇంకేంటి” అని మళ్లీ అడిగాడు. అప్పుడు నేను అన్నాను.. ఏంటి ఇలానే సింగిల్ గా ఉంటావా అని. అప్పుడు రామ్ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. నిజంగానే అడుగుతున్నావా? లేక నటిస్తున్నావా? అని అన్నాడు. కొన్నేళ్లుగా నేను ప్రపోజ్ చేస్తున్న సంగతి నీకు అర్థం కావట్లేదా? అని అనేశాడు’’ అని చెప్పారు సునీత.

    Also Read: ‘రాధేశ్యామ్’ గ్లింప్స్.. బ‌డ్జెట్ ఎంతో తెలుసా..?

    ఆ తర్వాత.. పెళ్లి గురించి చాలా ఆలోచించామని, తన పిల్లల తోనూ డిస్కస్ చేసినట్టు చెప్పారు సునీత. త‌మ‌కోసం త్యాగం చేసింది చాలు.. ఇప్పుడు తాము పెద్ద‌వాళ్లం అయ్యామ‌ని, ఇప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండాల‌ని చెప్పార‌ట పిల్లలు. దీంతో పెళ్లి సిద్ద‌మైంద‌ట సునీత‌.

    అయితే.. నిశ్చితార్థం కాకుండా నేరుగా పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో రామ్ కుటుంబ స‌భ్యులు తొలిసారి సునీత ఇంటికొచ్చి, ఆమెకు బట్టలు పెట్టారంట. ఈ ఫొటోలు బయటకు రావడంతో మీడియా ఆ అకేష‌న్ ను నిశ్చితార్థంగా మార్చేసింద‌ని చెప్పారు సునీత‌.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్