OTT: ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే.

పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
ఆహా :

రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్స్ గా వచ్చిన “ఖిలాడి” సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
‘అప్ లోడ్ వెబ్ సిరీస్ 2’ మార్చి 11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్‌ఫ్లిక్స్ :

అవుట్ క్యాండర్ (వెబ్ సిరీస్ 6) మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద ఆండీ వార్‌హోల్ డైరీస్ (వెబ్ సిరీస్) మార్చి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద లాస్ట్ కింగ్‌డమ్ (వెబ్‌సెరీస్-+) మార్చి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఆ ఆడమ్ ప్రాజెక్టు (హాలీవుడ్) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (హిందీ సిరీస్) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
రైడర్ (తెలుగు, కన్నడ) మార్చి11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
రౌడీ బాయ్స్(తెలుగు) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎంఎక్స్ ప్లేయర్
అనామిక (హిందీ) మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
మొత్తమ్మీద నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు.