OTT Releases This Week: ఈ వారం ఆచార్య రాబోతుంది. అయినా ప్రేక్షకులు మాత్రం ఓటీటీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అసలు ఒకపక్క తెలుగు తెర పై భారీ చిత్రాల హడావుడి ఒకపక్క ముమ్మరంగా జరుగుతున్నా.. మరోపక్క మాత్రం ఓటీటీల సందడి తగ్గడం లేదు అంటే గొప్ప విషయమే. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఆల్ రెడీ వచ్చేశాయి. ఆచార్య వంటి భారీ సినిమాలు అన్నీ థియేటర్ రిలీజ్ కోసం ముస్తాబు అవుతున్నాయి.
అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి, పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
నెట్ ఫ్లిక్స్ :
గంగూబాయి కథియావాడి(తెలుగు) ఏప్రిల్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

385 డేస్: ది డే(హాలీవుడ్) ఏప్రిల్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
మిషన్ ఇంపాజిబుల్ (తెలుగు) ఏప్రిల్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఓ జార్క్ (వెబ్ సిరీస్) ఏప్రిల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఊట్ :
బేక్ట్ (హిందీ సిరీస్+) ఏప్రిల్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద ఆఫర్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

జీ5 :
నెవర్ కిస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ (హిందీ) ఏప్రిల్ 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
