OTT Companies: తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎదిగింది. కానీ మన ఇండస్ట్రీ ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తుంది అంటే నమ్ముతారా?, నమ్మక తప్పదు, ఎందకంటే అదే నిజం కాబట్టి. ఏడాదికి వందల కొద్దీ సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ వాటిల్లో సక్సెస్ సాధించే సినిమాల సంఖ్య చాలా అంటే చాలా తక్కువ. కనీసం పది శాతం సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం లేదు. కానీ కరోనా తర్వాత ఒక మూడేళ్ళ పాటు నిర్మాతలకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. సినిమా థియేట్రికల్ రన్ తో సంబంధం లేకుండా, నిర్మాతలు ఎంత చెప్తే అంత ఇచ్చి సినిమాని తీసుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. ఆ కారణం చేత నిర్మాతలు ఒక సినిమాకు పెట్టే బడ్జెట్ ని కేవలం ఓటీటీ రైట్స్ ద్వారా రీకవరీ చేసుకునేవాళ్ళు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
హీరోలు కూడా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ని అందుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే ఓటీటీ లో అమ్మాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయని అంటున్నారు. స్టార్ హీరోల సినిమాలకు షూటింగ్ సెట్స్ మీద ఉన్నప్పుడే మంచి ఆఫర్లు దొరుకుతాయి, కానీ ఆ సినిమాకు నిర్మాత అడిగినంత డబ్బులు ఇవ్వాలంటే, థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఆ సినిమాకు వచ్చిన పెర్ఫార్మన్స్ ని బట్టీ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకవేళ సినిమా థియేటర్స్ లో అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే ముందు అనుకున్న రేట్ కి 25 శాతం వరకు తగ్గిస్తారట. చిన్న సినిమాలకు, అదే విధంగా పెద్ద సినిమాలకు కూడా ఇదే రూల్ వర్తిస్తుందని అంటున్నారు. అయితే థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిల్చిన ప్రతీ చిత్రం ఓటీటీ లో కూడా సక్సెస్ అవ్వాలని రూల్ లేదు.
చాలా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీ లో పెద్దగా వ్యూస్ ని సొంతం చేసుకోలేకపోయాయి. కానీ కొన్ని ఫ్లాప్ సినిమాలు మాత్రం భారీ వసూళ్లను సొంతం చేసుకున్నాయి. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘ఇడ్లీ కడై’. ధనుష్ హీరో గా నటించిన ఈ తమిళ చిత్రం తెలుగు లో ‘ఇడ్లీ కొట్టు’ పేరుతో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో నెల రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ఓజీ చిత్రానికి అదే నెట్ ఫ్లిక్స్ లో ఇడ్లీ కడై కంటే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. అందుకే కొంతమంది నిర్మాతలు ఓటీటీ సంస్థలు పెడుతున్న ఈ షరతులను ఒప్పుకోవడం లేదు. సినిమా థియేటర్స్ లో విడుదలైన తర్వాతే అమ్మాలని అనేక మంది నిర్మాతలు నిర్ణయించుకున్నారు.