Orange ReRelease : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) అభిమానులు ‘గేమ్ చేంజర్'(Gamechanger Movie) ఫలితం తో నిరాశలో ఉన్న సమయంలో, వాళ్లలో కాస్త ఆనందం నింపిన చిత్రం ‘ఆరెంజ్’ రీ రిలీజ్(Orange ReRelease). గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ షోస్ లాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసుకున్నారు. రెస్పాన్స్ ఎదిగిపోయింది. మొదటి రీ రిలీజ్ లో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో ‘జల్సా’ ,’ఖుషి’ రీ రిలీజ్ చిత్రాల తర్వాత మూడవ స్థానంలో నిల్చింది ఈ చిత్రం. అలాంటి సినిమాని ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న మరోసారి రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ మొదటి రీ రిలీజ్ రేంజ్ లోనే ఉంది. విడుదల చేసిన అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్స్. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు, నేడు కూడా ఈ చిత్రం హైదరాబాద్ వంటి సిటీస్ లో గణనీయమైన షోస్ తో ప్రదర్శింపబడుతుంది.
రెండవసారి రీ రిలీజ్ అయ్యి వారం రోజులైంది. ఈ చిత్రంతో పాటు విడుదలైన విశ్వక్ సేన్(Vishwak Sen) కొత్త చిత్రం ‘లైలా'(Laila Movie) హైదరాబాద్ లో ఒక్క థియేటర్ లో కూడా ప్రదర్శింపబడడం లేదు. కానీ ‘ఆరెంజ్’ చిత్రం ఏకంగా 20 నుండి 30 షోస్ తో ప్రదర్శితమవుతోంది. దీనిని బట్టి ఈ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్, పేటీఎం యాప్స్ కలిపి ఈ సినిమాకి దాదాపుగా వారం రోజుల్లో 2 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది సాధారణమైన చిన్న విషయం కాదండోయ్. నేటికి కూడా ఈ చిత్రానికి హైదరాబాద్ లో పలు మల్టీప్లెక్స్ షోస్ అద్భుతమైన ఆక్యుపెన్సీ ని దక్కించుకున్నాయి. ఒక ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ కి, వర్కింగ్ డేలో,అది కూడా 8వ రోజు ఇలాంటి ట్రెండ్ ఉండడం గమనార్హం.
ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి దాదాపుగా 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. రెండవసారి రీ రిలీజ్ అయిన ఒక చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. ధనుష్ ‘3’ మూవీ కి కూడా రీ రిలీజ్ లో రెండుసార్లు ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది కానీ , కలెక్షన్స్ మాత్రం ఆరెంజ్ రేంజ్ లో రాలేదు. ఇప్పటి తరం యువత ఆరెంజ్ మూవీ పాటలకు బాగా అడిక్ట్ అయిపోయారు. థియేటర్స్ లో ఆ పాటలను అనుభూతి చెందడానికి ఈ వీకెండ్ కూడా మరో రౌండ్ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ ని చూస్తుంటే, ఆ చిత్ర నిర్మాత నాగబాబు ఏడాది రెండు సార్లు రీ రిలీజ్ చేసుకున్నా వర్కౌట్ అయ్యేలా ఉంది. అభిమానులు రామ్ చరణ్ నుండి ఇలాంటి సినిమాలు కోరుకుంటున్నారు. ‘గేమ్ చేంజర్’ లాంటి అవుట్ డేటెడ్ సినిమాలను చెయ్యొద్దు అంటూ ఆరెంజ్ మూవీ రెస్పాన్స్ ని చూపించి, ఆయన్ని ట్యాగ్ చేసి వేడుకుంటున్నారు.