Operation Sindhur : ఆపరేషన్ సింధూర్(#OperationSindhoor)..ఈ పేరు వింటే పాకిస్తాన్ కి నిద్రపట్టదు. తమ దేశ సంపద గా భావిస్తున్న టెర్రరిస్ట్ క్యాంపులను కుప్ప కూల్చేసి ప్రపంచం మొత్తానికి మన ఇండియన్స్ సత్తా చాటిన ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్ కి పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ చేశారో, అప్పటి నుండి ఒక పార్టీ కి చెందిన మద్దతుదారులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. వాటిని పాకిస్తాన్ మీడియా కూడా వాడుకొని, ఇండియా ని మనం ఓడించాం అంటూ ప్రచారం చేసుకుంటుంది. కేవలం రాజకీయ లబ్ది కోసం దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టడం మన దేశానికీ నమ్మకద్రోహం చేయడంతో సమానం. పార్టీలుగా, కుల మతాలుగా, ఇలా ఎన్నో విధాలుగా మనం డివైడ్ అయ్యి ఉండొచ్చు. కానీ దేశం వరకు వస్తే ఐక్యం అవ్వాలి.
Also Read : ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచానికి భారత్ ఏం చెప్పింది?
నేడు మోడీ ని విమర్శిస్తున్న వాళ్ళందరూ, ‘ఆపరేషన్ సింధూర్’ సమయం లో కేవలం సపోర్ట్ చేస్తున్నట్టు నటించారంతే. సమయం వచ్చినప్పుడు విషం కక్కొచ్చు అని వారి ప్లానింగ్. విచిత్రమైన విషయం ఏమిటంటే ‘సీజ్ ఫైర్’ ని విధించడం పై ఏ పార్టీ అయితే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారో, అదే పార్టీ ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత రెండు దేశాల మధ్య ఏర్పడిన యుద్ధ ఛాయాలను చూసి, యుద్దాన్ని ఆపాలంటూ కామెంట్స్ చేసింది. ఇప్పుడు అదే పార్టీ సి ఫైర్ పై విమర్శలు చేయడం గమనార్హం. ఇలాంటోళ్లను చూసే కదా శత్రుదేశాలు మనపై ఇష్టమొచ్చిన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే సెలబ్రిటీస్ లో తమ అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్టుగా, ముక్కుసూటి తనంతో చాలా బోల్డ్ గా సమాధానం చెప్పే వారిలో ఒకరు యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam). సమాజం లో జరిగే అంశాలపై ఈమె తన సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడూ స్పందిస్తూనే ఉంటుంది.
Also Read : ఆపరేషన్ సిందూర్.. మసూద్ అజహర్ కుటుంబం హతం..
ఈ క్రమం లో ప్రధాని మోడీ ని, మన భారత సైన్యాన్ని అవమానిస్తున్న కొంతమంది నెటిజెన్స్ పై ఆమె తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘యుద్ధ సమయంలో శత్రువుని కీర్తించడం, సొంత దేశ నాయకుడిని విమర్శించడం వంటివి అభిప్రాయాలను వ్యక్తం చేయడం క్రిందకు రాదు, రాజద్రోహం క్రిందకు వస్తుంది’ అంటూ రష్మీ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇంత ఓపెన్ గా సున్నితమైన అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం చూస్తుంటే రష్మీ ఎంత ధైర్యవంతమైన అమ్మాయి అనేది అర్థం చేసుకోవచ్చు. రష్మీ లో ఉన్నంత ధైర్యం, కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్న స్టార్ హీరోలకు, హీరోయిన్లకు లేకపోయింది అంటూ సోషల్ మీడియా లో ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, మిగతా సెలబ్రిటీలపై విరుచుకుపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియా లో ఇప్పుడు పెద్ద చర్చనే నడుస్తుంది.
— rashmi gautam (@rashmigautam27) May 14, 2025