Who is Indian No 1 Hero: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ భాషలో ఏ హీరో సినిమా చేసినా కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమాను చూసి ఆదరిస్తున్నాడు… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా వాళ్ళకంటూ ఒక గొప్ప ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలావరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అమితాబచ్చన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. మరి ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాల వయసు రావడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోస్తున్నాడు. మరి ఆయన తర్వాత ఇప్పుడు ఆ పొజిషన్ ని అందుకునే వారు ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఒకప్పుడు నెంబర్ వన్ పొజిషన్ కోసం బాలీవుడ్ హీరోలు మాత్రమే పోటీపడేవాళ్లు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి.
వాళ్లకు అంత సోర్స్ లభించడమే కాకుండా ప్రతి స్టార్ హీరో చేస్తున్న సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుండడం వల్ల ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాలను చూసి వాళ్లకు అభిమానులుగా మారిపోతున్నారు…ప్రస్తుతం మన తెలుగు హీరోలకు మాత్రమే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉందని పలువురు సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ పాన్ ఇండియా సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం లేదు. ఇంకా మలయాళం వాళ్ళు పెద్దగా పాన్ ఇండియా సినిమాల గురించి పట్టించుకోవడం లేదు. అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమాలు చాలా రేర్ గా వస్తున్నాయి. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రమే వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి.
మన హీరోలు కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్లకు కూడా బాలీవుడ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మనవాళ్లు కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక అమితాబచ్చన్ ప్లేస్ ను రీప్లేస్ చేయగలిగే కెపాసిటీ ఉన్న హీరో ఎవరు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…