OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేస్తున్న మహేష్ ఈ ఏడాది భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గతేడాది ఈ బ్రాండ్ నుంచి రూ.7 కోట్లు తీసుకున్న సూపర్ స్టార్ ఈసారి ఏకంగా రూ.5 కోట్లు పెంచి రూ.12 కోట్లు పారితోషికం అందుకోనున్నాడు. సోషల్ మీడియాలోనూ ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయాల్సి ఉండటంతో ఈ స్థాయిలో డిమాండ్ చేసినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. నాని నటించిన జెర్సీ సినిమా ఇప్పటికే బాలీవుడ్‌లో రీమేక్ అవగా మరో మూవీ హిందీలోకి వెళ్లనున్నట్లు టాక్. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట. బెంగాల్ నేపథ్యంలో సాగే ఈ సినిమా నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read: పవన్ కళ్యాణ్ ఏంటి రామానుజాచార్యులపై ఇలా అనేశాడు?

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ ఫేం సరయు మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తన హోటల్ ప్రమోషన్ కోసం తీసిన పాటలో అభ్యంతరకర దృశ్యాలున్నాయనే ఆరోపణలొచ్చాయి. హిందువుల మనోభావాలకు భంగం కలిగేలా పాట ఉందని సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఆమె తన ప్రచార సాంగ్‌లో ‘కొంతమంది గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్‌ను తలకు ధరించి మద్యం సేవిస్తారు’ అని అవమానించినట్లు VHP నేత అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.