OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. వినోద రంగంలో అతిపెద్ద డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్‌ను నిర్వహిస్తున్న PVR, సినీ పోలిస్ విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం వీరిమధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ 2సంస్థలు విలీనం అయితే 1200కు పైగా స్క్రీన్లతో అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌గా విలీన కంపెనీ అవతరించనుంది. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం PVRకు 860, సినీ పోలిస్‌కు 400 స్క్రీన్లు ఉన్నాయి.

మరో అప్ డేట్ ఏమిటంటే.. యంగ్ హీరో నాగశౌర్య ఇటీవలే వరుడు కావలెను, లక్ష్య, అశ్వథ్థామ వంటి విభిన్న చిత్రాలలో హీరోగా మెప్పించాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్.కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ సింగర్ షిర్లే సెటియా హీరోయిన్‌గా చేస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ట్విట్టరులో షేర్ చేశారు.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. షూటింగ్‌కు కాస్తా బ్రేక్ తీసుకున్న టాలీవుడ్ నటుడు జగపతి బాబు.. ఫ్యామిలీతో కలిసి అరబ్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తాను చిల్ మూడ్‌లో ఉన్నానంటూ ఫ్యాన్స్‌తో దుబాయ్ ట్రిప్ ఫొటోను పంచుకున్నారు.

ఈ ఫొటోకి ‘దుబాయ్ వాటర్ పార్కులో అలసిపోయిన ఫ్యామిలీకి దాహం తీర్చడానికి’ అనే క్యాప్షన్ జత చేశారు. కూల్ డ్రింక్స్, కొబ్బరి బొండాన్ని సర్వ్ చేస్తూ దిగిన ఈ ఫోటోలో ఢిఫెరెంట్ లుక్‌లో కన్పించాడు.