Okkadu Vs Ghilli: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించి ఆ హీరో కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలు గా మిగిలిపోతూ ఉంటాయి.అలా ప్రతి ఒక్క హీరోకి వాళ్ళ కెరియర్లో ది బెస్ట్ సినిమాలు గా చెప్పుకునే కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి సినిమాలను చూసినప్పుడు ఆ హీరోల అభిమానులు కూడా చాలా సంతోష పడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా ఆయన కెరీర్ లోనే మొదటి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా…ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ బాబు స్టాండర్డ్ అనేది స్టార్ హీరో రేంజ్ లో పెరిగిపోయింది.
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ ‘ఒక్కడు ‘ సినిమాని ‘ గిల్లి ‘ సినిమా పేరుతో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమాకి ధరణి దర్శకత్వం వహించాడు. ఇక ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటిస్తే, అక్కడ త్రిష నటించింది.విలన్ గా ఇక్కడ అక్కడ ప్రకాష్ రాజే నటించాడు. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోని విజయ్ ఫ్యాన్స్ తెలుగులో మహేష్ చేసిన ఒక్కడు సినిమా కంటే తమిళం లో విజయ్ చేసిన గిల్లి సినిమానే బాగుందంటూ ఆయన యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో విజయ్ పైన మండిపడుతూ కామెంట్లను చేస్తున్నారు. నిజానికి ఈ రెండు సినిమాల్లో మనం ఇద్దరి యాక్టింగ్ ని గమనించినట్లయితే ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చేసిన యాక్టింగ్ ముందు గిల్లి సినిమాలో విజయ్ చేసిన యాక్టింగ్ తేలిపోతుంది.
అలాగే విజయ్ చాలా వరకు మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేశాడే తప్ప తన ఓన్ స్టైల్ లో మాత్రం ఈ సినిమాని చేయలేదు అనే విషయం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది. కానీ తమిళ తంబీలు మాత్రం మహేష్ బాబు ను డామినేట్ చేయడానికే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఇక మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒక సీన్ ని చూపిస్తూ అందులో విజయ్ యాక్టింగ్ ఎలా ఉందో చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ హీరోయిన్ ని తీసుకుపోతుంటే, హీరో వెళ్లి ప్రకాష్ రాజుని కొట్టి హీరోయిన్ ను సేవ్ చేసే సీన్ ఒక్కడు లో చాలా సింపుల్ గా ఉంటుంది.
మహేష్ బాబు ఫోన్ మాట్లాడుతూ ఉంటే ప్రకాష్ రాజ్ అమ్మాయిని తీసుకెళ్తుంటాడు. అప్పుడు మహేష్ అక్కడికి వెళ్లి ప్రకాష్ రాజ్ ను కొట్టి అమ్మాయిని సేవ్ చేస్తాడు. కానీ గిల్లి సినిమాలో మాత్రం ప్రకాష్ రాజ్ త్రిషను తీసుకెళ్తుంటే హీరో జాగింగ్ చేస్తూ ఉంటాడు.అది కూడా చలిని తగ్గించడానికి ఒక కోట్ వేసుకొని మధ్యాహ్నం సమయంలో జాగింగ్ చేస్తాడు. ఈ సీన్ చూసిన చాలామంది ఇదేం క్రియేటివిటీ రా నాయనా ఉన్న సీన్ ను ఉన్నట్టుగా తీస్తే అయిపోయేది మిట్ట మధ్యాహ్నం ఎవరైనా జాగింగ్ చేస్తారా ? అది కూడా కోటేసుకొని అంటు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..