OG Vs Kantara 2: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓజీ సినిమాకి చాలా మంచి హైప్ అయితే ఉంది. ఈ సినిమాని చూడడానికి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…2024 ఎలక్షన్స్ కి ముందు పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు కమిట్ అయిన విషయమైతే మనకు తెలిసిందే. ప్రస్తుతం వాటిని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమాను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో తన సత్తాను చాటుకోలేకపోయాడు. దాంతో ఎలాగైనా సరే ఓజి సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించి తన అభిమానులకు ఆనందాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఏ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్నైతే సాధించడం లేదు. దాంతో అతని అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. మరి ఓజీ సినిమా దానికి ఊతమిస్తూ భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇక ఇదిలా ఉంటే ఓజి మూవీ వచ్చిన వారానికి ‘కాంతార 2’ సినిమా రిలీజ్ అవుతోంది. కాంతార మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా హీరో దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కాంతార 2’ సినిమానైతే చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఇలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
నిజానికి ఓజి సినిమాతో పోటీ కి రాకపోయినా ఓజీ రిలీజ్ అయిన వారానికి ఈ సినిమా రావడం అనేది సరైనది కాదు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఓజీ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినట్టు అయితే కాంతార 2 మూవీకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఒకవేళ ఓజీ సినిమా డివైడ్ టాక్ తో ఉన్నట్లయితే కాంతార మూవీని ఆదరించే ప్రేక్షకుల సంఖ్య పెరగవచ్చు…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలకు కొంతవరకు మైనస్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దసర రోజు కాంతార సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఫెస్టివల్ వైబ్స్ ను వాడుకోవాలని వాళ్లు ముందుకు వస్తున్నారు. కానీ ఫైనల్ గా ఆ సినిమా ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…