OG Overseas Preview Show Talk: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మాత్రమే కాకుండా మూవీ లవర్స్, ట్రేడ్ ఇలా ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో మొదలైంది. వారం రోజులు మిగిలి ఉండగానే లక్షకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ దాదాపుగా రెండు మిలియన్ డాలర్లకు పైగానే ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమాకు ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 6 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఈ వారం లోనే మొదలు అవుతాయట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ ని లండన్ లో రీసెంట్ గానే మేకర్స్ ఒక ప్రైవేట్ స్క్రీన్ లో ప్రదర్శించారట.
ఎందుకంటే అక్కడే ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ మొత్తం జరిగింది. క్వాలిటీ చెక్ చేయడం కోసం నిర్మాత దిల్ రాజు, మరియు ఈ సినిమాని కొను గోలు చేసిన ఓవర్సీస్ బయ్యర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని చూశారట. వాళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్స్ లో డ్యాన్స్ వేసేలా ఉన్నారు ఆ టాక్ ని చూస్తుంటే. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుందట. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ సన్నివేశం వరకు అభిమానులు మెంటలెక్కిపోతారని, ఆ రేంజ్ హై యాక్షన్ సన్నివేశం ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చూడలేదని. సుజిత్ అందరి అంచనాలను దాటేసాడని అంటున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈమధ్య విడుదల అవుతున్న కొన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటున్నాయి కానీ , సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి తేలిపోతున్నాయి.
ఈ సినిమాకు కూడా అలాగే ఉంటుందా అనే భయం అభిమానుల్లో ఉంది. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ కి తిరుగులేని బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది లండన్ ప్రివ్యూ షో నుండి. పవన్ కళ్యాణ్ ని ఎన్ని యాంగిల్స్ లో ఎలివేషన్స్ ఇచ్చి లేపాలో, అన్ని యాంగిల్స్ లో డైరెక్టర్ సుజీత్ చూపించాడని, ఆయన అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ లాంటి సినిమా అని, మామూలు ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఎదురు చూడక తప్పదు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, థియేట్రికల్ ట్రైలర్ ఈ రెండు కూడా సెప్టెంబర్ 21 న రాబోతున్నాయి.