OG movie overseas release: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రీమియర్ షోస్ తో ప్రారంభం కానుంది. ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఎంతటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఇండియా లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. కానీ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 60 కోట్ల రూపాయిలు దాటేసింది. హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయితే కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు ప్రీ సేల్స్ నుండే వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు కూడా ‘హరి హర వీరమల్లు’ కి లాగానే ఓవర్సీస్ కష్టాలు ఎదురయ్యాయి. ఎందుకంటే సినిమా కంటెంట్ ఇంకా ఓవర్సీస్ చేరుకోలేదు.
కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి రెండున్నర మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అమెరికా థియేటర్స్ చైన్స్ లో అతి పెద్దదైన AMC ఇంకా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టలేదు. బుకింగ్స్ ప్రారంభించిన కొన్ని AMC థియేటర్స్ లో కూడా ఆపేసారు. వాళ్ళ రూల్స్ ప్రకారం కచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి కంటెంట్ వెళ్ళినప్పుడే బుకింగ్స్ ని మొదలు పెట్టాలి. వాళ్ళు పెట్టిన టైం లైన్ లోపు కంటెంట్ చేరుకోకుంటే బుకింగ్స్ ని రద్దు చేస్తారు. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. దాదాపుగా 72 వేల డాలర్లు AMC థియేటర్స్ నుండి కట్ అయ్యాయి. వాళ్ళ చేతుల్లోకి కంటెంట్ వెళ్ళినప్పుడే బుకింగ్స్ ని మళ్లీ రీ ఓపెన్ చేస్తారు. AMC థియేటర్స్ చైన్ నుండి దాదాపుగా 5 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఇప్పుడు అదంతా ప్రస్తుతానికి కోల్పోయినట్టే.
ప్రీమియర్స్ లో కల్కి రికార్డు ని బద్దలు కొట్టి, కచ్చితంగా ఆల్ టైం రికార్డు ని నెలకొల్పేంత సత్తా ఉన్న ఈ చిత్రం కేవలం మూడు మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ గ్రాస్ తో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మేకర్స్ చేసిన జాప్యం వల్లే ఇదంతా అని అభిమానులు సోషల్ మీడియా లో డైరెక్టర్ సుజిత్ మరియు నిర్మాత డీవీవీ దానయ్య ని ట్యాగ్ చేసి తిడుతున్నారు. జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సంజయ్ సాహు కి ఏది అంత తేలికగా దొరకదు అని, పవన్ కళ్యాణ్ సినిమాల ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. చూడాలి మరి రేపు ఈ సినిమాకు ప్రీమియర్స్ నుండి ఎలాంటి టాక్ వస్తుంది?, అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.