OG Movie 11 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం మేనియా ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. ‘కాంతారా 2’ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ‘ఓజీ’ చిత్రం జోరు ఏమాత్రం తగ్గలేదు. నిన్న అనేక ప్రాంతాల్లో ఈ చిత్రం కాంతారా 2 కంటే మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 288 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మేకర్స్ ఈ చిత్రానికి 308 కోట్ల రూపాయిలు 11 రోజుల్లో వచ్చినట్టు ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. సింగిల్ లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే ఇది భారీ వసూళ్లు అనే చెప్పాలి. కానీ ఇదే సినిమాని ఇతర భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసుంటే కచ్చితంగా ఇంకో వంద కోట్ల గ్రాస్ అదనంగా వచ్చి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
11 వ రోజున టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి కానీ, గ్రాస్ వసూళ్లు భారీగా రాలేదు. ఇక షేర్ విషయానికి వస్తే నాలుగు నుండి 5 కోట్ల రూపాయిల వరకు వచ్చిందని అంచనా. అంతే కాకుండా నిన్నటితో ఈ చిత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. అదే విధంగా నైజాం ప్రాంతం లో 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ల మార్కుని కూడా నిన్న అందుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కి ఇది మొట్టమొదటి 50 కోట్ల షేర్ సినిమా. హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో A సర్టిఫికేట్ అవ్వడం వల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని థియేటర్స్ లోకి అనుమతించలేదు. ఫలితంగా చాలా వరకు గ్రాస్ వసూళ్లు నష్టపోవాల్సి వచ్చింది.
లేదంటే నైజాం లో మరో 5 కోట్ల షేర్ వసూళ్లు ఎక్కువగా ఉండేది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రం 16 కోట్ల రూపాయిల వర్త్ షేర్ మార్కు ని నిన్నటితో అందుకున్నది. రిటర్న్ జీఎస్టీ తో కలిపి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఉండొచ్చు. అదే విధంగా సీడెడ్ లో 17 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 12 కోట్లు, కృష్ణ జిల్లా లో 8 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 175 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 288 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వారం తో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి కూడా అడుగుపెట్టింది.