Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో అభిమానులు మరియు ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న చిత్రం #OG. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత నెల 15 వ తారీఖు నుండి ముంబై లో ప్రారంభం అయ్యింది. సుమారుగా 15 రోజుల పాటుగా విరామం లేకుండా సాగిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ నేటితో పూర్తి అయ్యింది.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ , ప్రకాష్ రాజ్ మరియు మిగిలిన ముఖ్యమైన తారాగణం పాల్గొన్నారు. ఇక రేపటి నుండి రెండవ షెడ్యూల్ పూణే లో ప్రారంభం కానుంది, ప్రస్తుతం ప్రియాంక అరుళ్ మోహన్ మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించబోతున్న. పవన్ కళ్యాణ్ రెండు రోజుల తర్వాత ఈ షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
ఈ షెడ్యూల్ 8 వ తేదీ వరకు జరగనుంది, ఆ తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఇలా నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ని పూర్తి చేస్తుండగా, మేకర్స్ ముంబై షెడ్యూల్ పూతి అయ్యింది అనే సంతోషం లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక స్టైలిష్ ఫోటో ని ట్విట్టర్ లో అప్లోడ్ చేసారు. బ్లూ టీ షర్ట్ లో కళ్ళజోడు పెట్టుకొని స్టైల్ గా నడిచి వస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
ఇది కేవలం షూటింగ్ లొకేషన్స్ లో ఉన్న ఫోటోలు మాత్రమే అని, సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ ని చూస్తే మెంటలెక్కిపోవడం ఖాయమని, హాలీవుడ్ యాక్షన్ హీరో కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఉంటుందని, ఈ మూవీ టీం కి చెందిన కొంతమంది చెప్తున్నారు. ఫస్ట్ లుక్ విడుదలైన రోజులు సోషల్ మీడియా మొత్తం బ్లాస్ట్ అవ్వబోతుందని టాక్.