Homeఎంటర్టైన్మెంట్బిగ్ ఎనౌన్స్ మెంట్ : మహేష్-త్రివిక్రమ్ మూవీ

బిగ్ ఎనౌన్స్ మెంట్ : మహేష్-త్రివిక్రమ్ మూవీ

Mahesh Trivikram‘సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్’ చిత్రానికి సంబంధించిన తాజా ప్రకటన ఎప్పుడొస్తుందా ? అని అభిమానులు ఆశగా చూసిన ఎదురుచూపులకు… మొత్తానికి ఫలితం దక్కింది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమాని చాల పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నామని నిర్మాణ సంస్థ నుండి బిగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. పైగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాలతో రానున్న ఈ చిత్రాన్ని తమ సంస్థ నిర్మించబోతుంది అని హారికా హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. పోస్టర్ ను విడుదల చేసింది. పైగా 2022లో సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం. అలాగే నిర్మాణ సంస్థ పోస్ట్ చేసిన మెసేజ్ కూడా ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా కూడా ‘పాన్ ఇండియా మూవీ’గా రాబోతుంది. ఎలాగూ త్రివిక్రమ్ ఫుల్ సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు కాబట్టి.. మొత్తమ్మీద ఈ సినిమాకి మంచి మార్కెట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక గతంలో మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు మంచి హిట్ అయింది. పైగా ఆ సినిమా బుల్లితెర పై రికార్డ్స్ ను కూడా క్రియేట్ చేసింది. కానీ ఆ తరువాత ఈ కాంబినేషన్ లో వచ్చిన ‘ఖలేజా’ అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇప్పటికీ ఖలేజా ప్లాప్ ను మహేష్ బాబుతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఇంకా మర్చిపోలేదు. ఒక విధంగా ఆ సినిమా ప్లాప్ తోనే త్రివిక్రమ్ – మహేష్ మధ్య గ్యాప్ పెరిగింది. కానీ ఇప్పుడు చేస్తోన్న సినిమాతో ఇద్దరి మధ్య గ్యాప్ కూడా పోయింది కాబట్టి.. ఈ సారి సూపర్ హిట్ సినిమా వస్తోందేమో చూడాలి.

ఇక మహేష్ లోని నటుడిని కొత్తగా ఆవిష్కరించేలా త్రివిక్రమ్ ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే మహేష్ కెరీర్ లోనే అత్యున్నతమైన సినిమాలా ఇప్పుడు చేయబోయే సినిమా నిలిచిపోవాలని త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular