NTR- Pawan Kalyan: తాత పెట్టిన పార్టీ పరుల చేతిలో పడి కాదు పొమ్మంటోంది. బీజేపీ రారామ్మంటోంది. ఈ ఊగిసలాటలో ఏ పార్టీలో చేరుడేంటి? మనమే ఒక కొత్త పార్టీ పెడితే పోదా? అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సినీ మిత్రుడు పవన్ కళ్యాణ్ తో ఈ మేరకు ఎన్టీఆర్ భేటి అయ్యారంటూ ప్రచారం సాగుతోంది.

ఇటీవల ‘ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరును తొలగించి వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా జగన్ మార్చడమే ఈ వివాదాలకు కారణమైంది. ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని ఖండిస్తూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తెలుగుదేశం పార్టీ వాళ్లకు రుచించలేదు. ఆ ట్వీట్ లో ఎన్టీఆర్ తోపాటు వైఎస్ఆర్ ను కూడా సమంగా ఎన్టీఆర్ చూడడాన్ని తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ ఇద్దరూ సమఉజ్జీలు అన్నట్టుగా ఎన్టీఆర్ పేర్కొనడంపై ఆయనను ట్రోల్ చేస్తూ తెలుగుదేశం శ్రేణులు అవమానిస్తున్నాయి. అందుకే తన తాత పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబుకు షాకిస్తూ ఎన్టీఆర్ కొత్త పార్టీకి పురుడు పోయడానికి రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది. జగన్ ధాటికి కుదేలైంది. చంద్రబాబు వయసు అయిపోవడం.. లోకేష్ ఆస్థాయిలో అందిపుచ్చుకోవడంతో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు.

అందుకే పవన్ సహకారంతో తెలుగుదేశం పార్టీకి పోటీగా ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. తమ తెలుగుదేశాన్ని హైజాక్ చేసిన చంద్రబాబుకు షాకిచ్చేందుకే ఈ పార్టీకి పురుడు పోస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు మద్దతుగా మాట్లాడినా కూడా తనను టార్గెట్ చేసిన తెలుగుతమ్ముళ్లను ధీటుగా జవాబిచ్చేందుకు జూనియర్ ఈ ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగబోతున్నట్టు ఒక వార్త వైరల్ అవుతోంది. మరి ఎన్టీఆర్ నిజంగానే రాజకీయాల్లోకి వస్తాడా? లేదా? అన్నది వేచిచూడాలి.