https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ దృష్టిలో ‘యమ హాట్ హీరోయిన్’ ఎవరో తెలుసా? ఆమె ముందే చెప్పి షాక్ ఇచ్చిన నందమూరి హీరో!

తనతో పని చేసిన ఓ హీరోయిన్ ని యమ హాట్ అంటూ కుండబద్దలు కొట్టాడు ఎన్టీఆర్. ఆమె ముందే ఆ విషయం చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ క్రమంలో శ్రీదేవి, చార్మీలపై కూడా క్రేజీ కామెంట్స్ చేశాడు. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

Written By: , Updated On : February 25, 2025 / 08:36 AM IST
NTR (2)

NTR (2)

Follow us on

NTR: జూనియర్ ఎన్టీఆర్ తానేమీ రొమాంటిక్ కాదు అంటాడు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఇదే అభిప్రాయం వెల్లడిస్తుందట. అయితే ఎన్టీఆర్ లో మాత్రం రొమాంటిక్ యాంగిల్ ఉంది. ఆయనకు ఓ బ్రేకప్ లవ్ స్టోరీ కూడా ఉంది. అశోక్ మూవీ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డితో రిలేషన్ లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరి వ్యవహారం పెళ్లి వరకూ వెళ్లిందట. గతంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని అనంతరం ఎన్టీఆర్ ఒప్పుకోవడం విశేషం. ఒక దశ తర్వాత పర్సనల్ లైఫ్ తో ప్రొఫెషన్ ని మిక్స్ చేయడం సరికాదని.. ప్రేమను వదులుకున్నానని ఎన్టీఆర్ చెప్పారు.

ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ఎవరో పేరు చెప్పలేదు. ఇక ఎన్టీఆర్ రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో చాలా మంది హీరోయిన్స్ తో పని చేశాడు. వారిలో రమ్యకృష్ణ కూడా ఒకరు. సింహాద్రి మూవీలో రమ్యకృష్ణ స్పెషల్ సాంగ్ చేసింది. ఎన్టీఆర్ తో కలిసి కాలు కదిపింది. ఓ ఇంటర్వ్యూలో నీ దృష్టిలో హాట్ హీరోయిన్ ఎవరని రమ్యకృష్ణ ఎన్టీఆర్ ని అడిగింది. మీరే అని ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు.

మీరు, శ్రీదేవి చాలా హాట్ గా ఉంటారు. నా దృష్టిలో మీరిద్దరూ యమా హాట్ అని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇక స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనకలను ఏ హీరోయిన్స్ తో పోల్చుతావని అడగ్గా… శ్రీదేవి, రమ్యకృష్ణ, రంభల పేర్లు చెప్పాడు ఎన్టీఆర్. రమ్యకృష్ణ మరొక ప్రశ్నగా వాగుడుకాయ ఎవరని అడగ్గా.. ఛార్మి అని ఎన్టీఆర్ సమాధానం చెప్పాడు. నేనే అనుకుంటే ఛార్మి నాకంటే వాగుడుకాయ. ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది చెప్పుకొచ్చాడు.

ఈ ఇంటర్వ్యూ చాలా కాలం క్రితం జరిగింది. సదరు ఇంటర్వ్యూలో ఎన్టీఆర్-రమ్యకృష్ణల మధ్య ఈ సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్టీఆర్ కెరీర్ పరిశీలిస్తే ఆర్ ఆర్ ఆర్ అనంతరం దేవరతో ఎన్టీఆర్ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల వసూళ్ల వరకు రాబట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.