NTR Warning To Koratala Siva: కొరటాల శివ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు మూడేళ్ళ నుండి ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు..షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యినప్పటికీ కూడా కరోనా కారణంగా వరుస లాక్ డౌన్స్ వల్ల ఈ సినిమా భారీగా నష్టపోయింది..ఈ సినిమాకి కేవలం వడ్డిలే దాదాపుగా 50 కోట్ల రూపాయిల వరుకు కట్టాము అని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఎట్టకేలకు ఇలాంటి అడ్డంకులు అన్నిటిని అధిగమించి ఈ సినిమా రేపు 2000 థియేటర్స్ లో ఘనంగా రేపు విడుదల కాబోతుంది..భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Also Read: CM Jagan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. టార్గెట్ చంద్రబాబు..యుద్ధం ఆ నాలుగు మీడియా సంస్థలపై..
ఇది ఇలా ఉండగా కొరటాల శివ తన తదుపరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో కొరటాల శివ ని మీడియా విలేఖరులు అడగగా దానికి ఆయన సమాధానం ఇస్తూ ‘ నా సినిమాలు అన్నీ సోషల్ సబ్జక్ట్స్ అని అందరూ అంటూ ఉంటారు..ఈసారి వాటి జోలికి వెళ్లకుండా ఒక్క పక్కా మాస్ సబ్జెక్టు ని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశా..కచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకునే విధంగానే ఈ స్క్రిప్ట్ వచ్చింది..ఎన్టీఆర్ కి కూడా ఈ కథ అద్భుతంగా నచ్చింది..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మే 23 వ తారీఖున అధికారికంగా ప్రకటిస్తాము..ఇప్పటికే ఎన్టీఆర్ ని మరియు ఆయన అభిమానుల్ని చాలా వెయిట్ చేయించాను..ఇక వెయిట్ చేయించను..ఆచార్య సినిమా పూర్తి అయ్యే వరుకు ఎన్టీఆర్ నాతో సినిమా ఎప్పుడు ప్రారంబిస్తావు అని ఏమి అడగలేదు..కానీ ఆచార్య సినిమా విడుదల అయినా తర్వాత మాత్రం నిన్ను కిడ్నప్ చేసేస్తా అని ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ.
Also Read: Pavan Kalyan Last Movie: పవన్ కళ్యాణ్ ఆఖరి మూవీ అదేనా..?
Recommended Videos:
[…] Also Read: NTR Warning To Koratala Siva: కొరటాల శివ కి ఎన్టీఆర్ వార… […]