NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు రానటువంటి ఒక కొత్త సబ్జెక్టుతో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది… కేజీఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు…
పాన్ ఇండియాలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికి స్టార్ హీరోల సినిమాలకి ఉన్న గుర్తింపు మరే సినిమాలకు ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు వరుసగా భారీ విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు… ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ షూట్ కి రెడీ అయింది. మరి ఇలాంటి సందర్భంలోనే వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ప్రతి విషయాన్ని తను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే వరుసగా ఎనిమిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వాడవుతాడు. తద్వారా ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఎన్టీయార్ ఈ సినిమాని ఎలాగైనా సరే భారీ విజయంగా మలిచాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందట.
ఆయన ఇప్పటివరకు పోషించినటువంటి ఒక డిఫరెంట్ రోల్ లో ప్రశాంతి నిల్ అతన్ని చూపించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ సినిమాలో ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.
సింహాద్రి (Simhadri) సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి భారీ ఎలివేషన్స్ తో ఉండే సినిమా ఒకటి పడలేదు. ఆ లోటును ఈ సినిమాతో తీర్చుకుంటానని జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
తన తోటి హీరో అయిన అల్లు అర్జున్ (Allu Arjun)’పుష్ప 2′ (Pushpa 2) సినిమాతో 2000 కోట్ల మార్కును టచ్ చేసే ప్రయత్నం చేసినప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా 500 కోట్ల కలెక్షన్ల దగ్గరే ఆగిపోవడం అనేది అతను అభిమానులను సైతం తీవ్రంగా కలిచి వేస్తుంది… అందుకే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని రెండు వేల కోట్లు మార్క్ కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…