Homeఎంటర్టైన్మెంట్Jr NTR Rejected Movie: ఎన్టీఆర్ చెయ్యాల్సిన సినిమా విజయ్ దేవరకొండ చేతుల్లోకి.. బంగారం లాంటి...

Jr NTR Rejected Movie: ఎన్టీఆర్ చెయ్యాల్సిన సినిమా విజయ్ దేవరకొండ చేతుల్లోకి.. బంగారం లాంటి ఛాన్స్ మిస్..

Jr NTR Rejected Movie: మన టాలీవుడ్ లో ఒక హీరో చెయ్యాల్సిన సినిమా , మరో హీరో చేయడం కొత్తేమి కాదు. కేవలం ఒక్క టాలీవుడ్ లోనే కాదు , ప్రతీ ఇండస్ట్రీ లోను ఇలాంటివి సర్వ సాధారణం. అలా అత్యధికంగా సూపర్ హిట్ సినిమాలను వదులుకున్న హీరో గా జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర లో నిలిచిపోతాడు. భద్ర, బొమ్మరిల్లు, కిక్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అప్పట్లో ఎన్టీఆర్ మిస్ అయ్యాడు. అంతెందుకు రీసెంట్ గా ‘పెద్ది’ చిత్రాన్ని కూడా ఆయన వదులుకోవాల్సి వచ్చింది. రామ్ చరణ్ హీరో గా నటించిన ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ని ముందుగా ఎన్టీఆర్ తోనే చెయ్యాలని అనుకున్నాడు డైరెక్టర్ బుచ్చి బాబు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల, అది రామ్ చరణ్ కి షిఫ్ట్ అయ్యింది.

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే విజయ్ దేవరకొండ ‘హాయ్ నాన్న’ దర్శకుడు సౌరవ్ తో ఒక సినిమాని గ్రాండ్ గా ఒక క్రేజీ పోస్టర్ ద్వారా ప్రకటించాడు. కేవలం పోస్టర్ తోనే ఆడియన్స్ మెంటలెక్కిపోయేలా చేసాడు సౌరవ్. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ స్టోరీ అట ఇది. మైథాలజీ టచ్ కూడా ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ముందుగా సౌరవ్ ఎన్టీఆర్ కే వినిపించాడట. కానీ ఈ సినిమా నా ఇమేజ్ కి సరిపోదు , కుర్ర హీరోలతో చేస్తే బాగుంటుందని ఆయన రిజెక్ట్ చేశాడట. అలా రిజెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ని వదులుకొని ఎన్టీఆర్ తప్పు చేశాడా?, లేదా సరైన నిర్ణయం తీసుకున్నాడా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఎదురు చూడక తప్పదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ , ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 న విడుదల చేయబోతున్నారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది . ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన ‘దేవర 2’ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఆయన త్రివిక్రమ్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రం కూడా చేయబోతున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు ఎన్టీఆర్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular