Homeఎంటర్టైన్మెంట్'ఎన్టీఆర్' పొలిటికల్ బిజినెస్.. ప్రజలే కస్టమర్లు !

‘ఎన్టీఆర్’ పొలిటికల్ బిజినెస్.. ప్రజలే కస్టమర్లు !

NTR
‘అయినను పోయి రావలె హస్తినకు’.. అబ్బా.. ఈ టైటిల్ వింటేనే ఏదో కొత్త ఫీలింగ్ వస్తోంది అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నిజానికి తారక్ సినిమాల్లోనే ఇలాంటి వైవిధ్యమైన టైటిల్ ఇంతవరకూ రాలేదు. పైగా, ఈ సినిమా కథ కూడా నందమూరి అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. రాజకీయాల పై నడిచే ఓ కొత్త కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది. అందుకే, మొదటి నుండి తారక్ అభిమానులు ఈ సినిమా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఒక్క హిట్ కే కోటి అడుగుతుందట !

దీనికితోడు ‘అరవింద సమేత’ భారీ హిట్ అవ్వడంతో.. ఆ విజయోత్సాహంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఘనంగా ఈ సినిమాని ప్రకటించడం కూడా ఈ సినిమా పై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. అన్నిటికిమించి హారిక అండ్ హాసిని బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న సినిమా ఇది. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రత్యేకం అయింది. కానీ, ఎప్పుడో మొదలుకావాల్సిన ఈ సినిమా.. త్వరలోనే షూటింగ్ రెడీ అవుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూట్ ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తన ట్రాక్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయిందట.

Also Read: హైదరాబాద్ మేయర్ ను వదలని వర్మ.. ట్వీట్ వైరల్

అందుకే త్వరలోనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నాడట ఎన్టీఆర్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మార్చి మూడో వారం నుండి షూట్ మొదలుపెడతారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. అనుకోకుండా ఇండియాకి వచ్చిన ఓ బిజినెస్ మెన్ కథ అట ఇది. పక్కా బిజినెస్ మైండెడ్ అయిన హీరో ఇండియాలోని పాలిటిక్స్ కి మించిన బిజినెస్ లేదనిపిస్తోందని.. రాజకీయాలనే తన వ్యాపారంగా మలుచుకుని.. రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తాడని.. ప్రజలనే తన కస్టమర్లుగా మార్చేస్తాడని.. ఒక యూనివర్సల్ పాయింట్ తో త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular