
దర్శకుడు వంశీ పైడిపల్లి తొలి చిత్రం మున్నా ఫెయిల్ అయ్యాక కసిగా రెండో సినిమా బృందావనం తీసి తానేమిటో నిరూపించుకొని ఆ తరవాతి కాలం లో పెద్ద దర్శకుడయ్యాడు. 2010 లో వచ్చిన ఈ సినిమాకి కరెక్ట్ గా పదేళ్ల తరవాత సీక్వెల్ తీయాలన్న ఆలోచన వంశీ పైడిపల్లి కి వచ్చిందట… గత ఏడాది మహేశ్ బాబుకి ‘మహర్షి’ వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనతోనే ప్లాన్ చేసుకున్నాడు. అయితే మహేష్ బాబు ఆ కథ నచ్చక పోవడం వల్ల రెండో సినిమా పట్టాలెక్కలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేసిన వంశీ పైడిపల్లి, రకరకాల ప్రయత్నాలు చేసి చివరకు ఎన్టీఆర్ తో ‘బృందావనం’ సీక్వెల్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు.
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
ఎన్టీఆర్ .. సమంత .. కాజల్ , శ్రీహరి , ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రధారులుగా వంశీ పైడిపల్లి చేసిన ‘బృందావనం’ 2010లో భారీ విజయాన్ని సాధించి ఒక మరపురాని చిత్రంగా నిలిచి పోయింది. దాంతో వంశీ పైడిపల్లి ఆ సినిమా కి సీక్వెల్ కథను సిద్ధం చేయడం కూడా జరిగింది . మళ్ళీ ఇన్నాళ్లకు దాన్ని బయటికి తీసి ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించాలను కొంటున్నాడట.