NTR – Koratala movie : రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ – కొరటాల సినిమా!

NTR – Koratala movie  : #RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు రోజుకో అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తున్నాయి..ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే ఖరారు అయ్యిపోయింది..మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుథ్ సెట్ అయ్యాడు. అలా కాస్టింగ్ మొత్తం ఎప్పుడో […]

Written By: NARESH, Updated On : January 3, 2023 9:23 pm
Follow us on

NTR – Koratala movie  : #RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు రోజుకో అప్డేట్ సోషల్ మీడియా లో లీక్ అవుతూ ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తున్నాయి..ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే ఖరారు అయ్యిపోయింది..మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుథ్ సెట్ అయ్యాడు.

అలా కాస్టింగ్ మొత్తం ఎప్పుడో సిద్దమైనప్పటికీ కథ విషయం మరింత కసరత్తు చెయ్యడానికి ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ సమయం తీసుకున్నాడు..ఎందుకంటే గత ఏడాది ఆయన మెగాస్టార్ చిరంజీవి తో తెరకెక్కించిన ఆచార్య చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడమే..అందుకే అప్పటి నుండి తనలోని లోపాలను సరిదిద్దుకొని, ఎన్టీఆర్ తో చెయ్యబొయ్యే కథని అత్యంత శక్తివంతంగా మలిచాడట..ఈ కథ మొత్తం అండర్ వాటర్ నేపథ్యం లో సాగుతుంది..అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

అదేమిటి అంటే ఎన్టీఆర్ – కొరటాల సినిమా కేవలం ఒక్క పార్ట్ మాత్రం కాదట..రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు అట..మొదటి భాగం 2024 లో, మరియు రెండవ భాగం 2025 వ సంవత్సరం లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..ఈమధ్య కాలం లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని ఏలుతుంది..బాహుబలి 2 మరియు KGF చాప్టర్ 2 ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

వీటితో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘పుష్ప’ కి సీక్వెల్ గా పుష్ప 2 అతి త్వరలోనే తెరకెక్కబోతుంది..ఇలా వరుసగా పాన్ ఇండియా వైడ్ సీక్వెల్ క్రేజ్ పట్టుకోవడం తో, ఎన్టీఆర్ – కొరటాల సబ్జెక్టు కి సీక్వెల్ తీసేంత స్కోప్ ఉండడం తో మరో మారు ఆలోచించకుండా సీక్వెల్ ని ప్లాన్ చేసాడు కొరటాల శివ..చూడాలి మరి ఈ చిత్రం ఎంతమేరకు సక్సెస్ సాదిస్తుంది అనేది.